AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్‌

భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్‌

Phani CH
|

Updated on: Apr 29, 2026 | 6:34 PM

Share

భారతదేశంలో ఎన్నో వింత ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో కొన్నింటిని దెయ్యాలు, ఆత్మలు నివాసముంటాయని నమ్ముతారు. రాజస్థాన్‌లోని బంగర్‌ కోట, ఢిల్లీలోని అగ్రసేన్ కీ బావ్‌లీ అలాంటివే. అయితే గుజరాత్‌లోని డ్యూమాస్ బీచ్ తన నల్లటి ఇసుక, భయానక కథలతో అత్యంత ప్రసిద్ధి. ఇది ఒకప్పుడు శ్మశాన వాటిక కావడంతో ఆత్మలు తిరుగుతాయని స్థానికులు చెబుతారు. పగటిపూట సందడిగా ఉన్నా, రాత్రయితే నిశ్శబ్దంగా, భయంకరంగా మారుతుంది.

కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్నభారతదేశంలో వింతలకు కొదవ లేదు. కొన్ని ప్రాంతాలు దెయ్యాలు ఆత్మలకు నివాసం ఉంటాయని ప్రసిద్ధి. అక్కడికి రాత్రుళ్లు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. రాజస్థాన్ లోని బంగర్‌ కోటలో తన ప్రేమను పొందలేని ఒక మాంత్రికుడి శాపం కారణంగా వింత శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. ఢిల్లీలోని అగ్రసేన్ కీ బావ్‌లీ అనే మెట్లబావి చుట్టూ భయంకర కథలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో బావిలో చాలా మంది మునిగి చనిపోవడంతో అది దెయ్యాల బావిగా మారిందని అంటారు. అయితే అమీర్ ఖాన్ నటించిన ‘PK’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. అలాంటి భయం గొలిపే మరో ప్రాంతం డ్యుమాస్ బీచ్‌. గుజరాత్‌లోని సూరత్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యూమాస్ బీచ్ ఇసుక నల్లగా ఉండటంతో పాటు, అత్యంత భయానక దెయ్యాల ప్రాంతంగా పేరు పొందింది. ఈ వింతైన వాతావరణమే పర్యాటకులను ఇక్కడికి ఆకర్షిస్తోంది. స్థానికంగా ప్రచారంలో ఉన్న కథల ప్రకారం, డ్యూమాస్ బీచ్ ఒకప్పుడు హిందువుల శ్మశాన వాటికగా ఉండేది. అందుకే అక్కడ ఆత్మలు తిరుగుతాయని నమ్ముతారు. సూర్యాస్తమయం తర్వాత గాలిలో గుసగుసలు వినిపిస్తాయని, ఎవరో తమను గమనిస్తున్నట్లు అనిపిస్తుందని సందర్శకులు చెబుతుంటారు. రాత్రిపూట కుక్కలు వింతగా అరవడం, కొందరు వ్యక్తులు అదృశ్యమయ్యారనే కథలు కూడా వినిపిస్తాయి. అయితే, ఈ భయానక కథలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇసుక నల్లగా ఉండటానికి అందులోని ఖనిజాలే కారణమని, గాలి, అలల శబ్దాలే గుసగుసలుగా భ్రమ కలిగిస్తాయని నిపుణులు చెబుతారు. ఈ భయానక కథలు ఎలా ఉన్నా, పగటిపూట డ్యూమాస్ బీచ్ సందర్శకులతో సందడిగా ఉంటుంది. ఇక్కడి ఫుడ్ స్టాల్స్‌లో లభించే వేడివేడి భజియాలు, పావ్ భాజీ, గుజరాతీ స్నాక్స్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అయితే, చీకటి పడేకొద్దీ వాతావరణం నిశ్శబ్దంగా, కాస్త భయానకంగా మారుతుంది. భద్రతా కారణాల వల్ల లేదా ప్రచారంలో ఉన్న కథల వల్ల, సూర్యాస్తమయం తర్వాత అక్కడ ఉండవద్దని స్థానికులు సూచిస్తుంటారు. రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలకు భిన్నంగా, ప్రశాంతమైన, సహజమైన అనుభూతిని కోరుకునే వారికి డ్యూమాస్ బీచ్ ఒక ప్రత్యేకమైన ఎంపిక. అక్కడి నల్లటి ఇసుక, నీలి సముద్రం, సూర్యాస్తమయ దృశ్యాలు, ఆ మిస్టరీ వాతావరణం ప్రయాణికులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని అందిస్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..

వేసవిలోనూ మీ జుట్టును కాపాడుకోండి ఇలా..!

విశాఖ జూలో ‘ఘోస్ట్ ఆఫ్ జంగిల్’

స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..

భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

Follow Us