సినిమాలో ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ నటుడు మారిముత్తు జీవితం అందుకు భిన్నం. సుబ్రమణ్యపురం వంటి విజయవంతమైన చిత్రంలో నటించి గుర్తింపు పొందినప్పటికీ, అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.