AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాక్షి ధోనీ ధరించిన.. వాచీ ధర రూ. 3.1 కోట్లు!

సాక్షి ధోనీ ధరించిన.. వాచీ ధర రూ. 3.1 కోట్లు!

Phani CH
|

Updated on: Apr 29, 2026 | 6:36 PM

Share

ఐపీఎల్ సందడిలో స్టార్ల భార్యలు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ సృష్టిస్తున్నారు. ఖరీదైన లగ్జరీ వాచ్‌లతో స్టేడియంలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇటీవల సాక్షి ధోనీ ₹3.1 కోట్ల రిచర్డ్ మిల్లే వాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించగా, అనుష్క శర్మ కూడా ₹28 లక్షల కార్టియర్ వాచ్‌తో మెరిశారు. ఈ ట్రెండ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఓ వైపు ఎండలు మండుతుంటే ఐపీఎల్ ఫీవర్‌ దేశవ్యాప్తంగా తారాస్థాయికి చేరుకుంది. అభిమానులు తమ అభిమాన జట్ల కోసం స్టేడియంలకు పోటెత్తుతున్నారు. మరోవైపు ఆటగాళ్ల భార్యలు గ్యాలరీలో కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. ఖరీదైన లగ్జరీ వాచ్‌లను క్యాజువల్ దుస్తులతో జత చేస్తూ అందరి చూపు తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సాక్షి ధోనీ ఏకంగా 3.1 కోట్ల రూపాయల విలువైన వాచీతో కనిపించారు. దీంతో అంతా షాకయ్యారు. ఏప్రిల్ 23న ముంబైలో జరిగిన చెన్నై, ముంబై మ్యాచ్ సందర్భంగా సాక్షి ధోనీ కెమెరా కంటపడ్డారు. ఆమె పూల డిజైన్‌తో ఉన్న క్రీమ్ కలర్ సూట్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. అయితే, అందరి దృష్టి ఆమె చేతికున్న ఆకుపచ్చ రంగు వాచీపై పడింది. సాక్షి ధరించిన ‘రిచర్డ్ మిల్లె’ వాచీ ధర 3,34,000 డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3.1 కోట్లు. ఈ వాచ్‌ మోడల్ పేరు ‘రిచర్డ్ మిల్లె’. దక్షిణాఫ్రికాకు చెందిన ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు హోల్డర్ అయిన వేడ్ వాన్ నీకెర్క్ సాధించిన ఘనతకు గుర్తుగా స్విస్ వాచ్‌మేకర్ దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ప్రముఖ అథ్లెట్ల కోసం తేలికైన, అత్యంత పనితీరు కనబరిచే వాచీలను తయారు చేయడంలో రిచర్డ్ మిల్లె సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ వాచ్‌ కేస్‌ను క్వార్ట్జ్ టీపీటీ అనే ప్రత్యేకమైన మెటీరియల్‌తో తయారు చేశారు. దక్షిణాఫ్రికా జెండాను సూచిస్తూ పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ మెటీరియల్ చాలా తేలికగా ఉండటమే కాకుండా, ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలదు. దీనికి ఎలాంటి బకిల్ లేదా clasp లేకుండా, మణికట్టుకు సులభంగా సరిపోయే ఎలాస్టిక్ స్ట్రాప్ ఉంటుంది. ఏప్రిల్‌ 24న జరిగిన ఆర్‌సీబీ, గుజరాత్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ కూడా రూ. 28 లక్షల విలువైన ‘పాంథేర్ డి కార్టియర్’ వాచీతో కనిపించారు. మొత్తంగా ఈ స్టార్ల భార్యలు ధరిస్తున్న వాచ్‌లు ఫ్యాషన్ యాక్సెసరీలుగా సంచలనం సృష్టిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్‌

పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..

వేసవిలోనూ మీ జుట్టును కాపాడుకోండి ఇలా..!

విశాఖ జూలో ‘ఘోస్ట్ ఆఫ్ జంగిల్’

స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..

Follow Us