AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కావిడి కట్టి.. తల్లిని మోసి.. 3 నెలలు 24 రోజుల పాటు 1,800 కి.మీ నడిచి

కావిడి కట్టి.. తల్లిని మోసి.. 3 నెలలు 24 రోజుల పాటు 1,800 కి.మీ నడిచి

Phani CH
|

Updated on: Apr 30, 2026 | 4:31 PM

Share

హైదరాబాద్‌లో యువత బైక్ స్టంట్స్‌పై సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. పెట్రోల్ బంకులో జరిగిన వీలింగ్ ఘటన, పక్క బైక్‌ను ఢీకొట్టడం వంటి పిచ్చి విన్యాసాలను ఖండించారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికని ప్రాణాలతో చెలగాటమాడటం మూర్ఖత్వమన్నారు. తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని యువతను హెచ్చరించారు.

హైదరాబాద్‌ నగరంలో యువత పిచ్చి విన్యాసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో తమ ప్రాణాలతోనే కాకుండా, ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యువతకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా, ఓ పెట్రోల్ బంకులో యువకులు చేసిన బైక్ స్టంట్ వీడియోపై ఆయన ఘాటుగా స్పందించారు. నగరంలోని ఒక పెట్రోల్ బంకులో కొందరు యువకులు పెట్రోలు కొట్టించుకునేందుకు వచ్చారు. అదే బంకుకి మరికొందరు అమ్మాయిలు కూడా పెట్రోల్‌ కోసం వచ్చారు. ఆ అమ్మాయిలను చూసి ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. పెట్రోలు కొట్టించుకునేందుకు క్యూలో ఉన్నవారు ఒక్కసారిగా బైక్‌పై వీలింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ స్టంట్ అదుపు తప్పి పక్కనే ఉన్న మరో బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో అక్కడున్న వాహనదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన సీపీ సజ్జనార్ తనదైన శైలిలో యువతకు చురకలు అంటించారు. “వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో, అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం!” అని విరుచుకుపడ్డారు. కేవలం ఒక్క క్షణం ‘షో’ కోసం, అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని ఆయన హెచ్చరించారు. “గుర్తుంచుకోండి.. మీరు చేసే వీలింగ్స్ మీ ఇంటి వద్ద మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి ఫీలింగ్స్ మిగల్చకూడదు” అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. క్షణికావేశంలో చేసే పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని యువతకు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు

LPG Gas Cylinder: మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల షాక్ !!

అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..

పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. దివ్య సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్

చరణ్ మెరుపు సినిమా ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది ??

Follow Us