ఆయుర్వేద వైద్యుల ప్రకారం, నల్ల మిరియాలు రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలోని పైపెరిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను ఉత్తేజపరచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి, దగ్గు, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.