AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్

Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 5:47 PM

Share

"ధురంధర్‌" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని నమోదు చేస్తోంది. ప్రీమియర్‌ షోలకే రూ.75 కోట్లు వసూలు చేసి హిందీ రికార్డులను చెరిపేసింది. పుష్ప 2 కలెక్షన్లను చేరువవుతూ, నార్త్-సౌత్ తేడా లేకుండా అద్భుతమైన ప్రశంసలు అందుకుంటోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సైతం దీన్ని కొనియాడారు. ఈ వారాంతానికి రూ.325-375 కోట్లకు చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అక్కడా.. ఇక్కడా.. అనే తేడా లేదు. అన్ని చోట్లా యునానిమస్‌ టాక్‌. అబ్బా… ఏం సినిమా తీశార్రా.. ఫలానా సీన్‌ ఎంత బావుంది… ఫలానా ఎపిసోడ్‌ హైలైట్‌ అస్సలు.. అన్నీ ఇలాంటి మాటలే. ఇంతకీ ఏ సినిమా గురించో మీకు అర్థమైనట్టేగా… మరింకెందుకు ఆలస్యం.. పనిలో పనిగా సెలబ్రిటీలు చెప్పిన మాటలు… సినిమా కలెక్షన్ల మీద కూడా ఫోకస్‌ చేసేద్దాం. ధురంధర్‌.. ధురంధర్‌… ధురంధర్‌.. ప్రీ సమ్మర్‌ హీట్‌ మొత్తం ఇప్పుడు ధురంధర్‌ చుట్టూనే తిరుగుతోంది. సినిమా ఆ రేంజ్‌లో ఉంటే, సక్సెస్‌ టాక్‌ కూడా అలాగే ఉంటుంది కదా మరి. ప్రీమియర్‌ షోలు పడ్డ రోజు వీకెండ్‌ కాదు.. రెగ్యులర్‌గా సినిమాలు రిలీజ్‌ అయ్యే శుక్రవారం అంతకన్నా కాదు.. ఒక రకంగా చెప్పాలంటే మిడ్‌ వీక్‌.. అలాంటి రోజు ప్రీమియర్‌ షోలకే 75 కోట్లు వచ్చాయా? అసలు ఎవరైనా ఈ ఫిగర్‌ని ఊహించారా? అంటూ విస్తుపోతున్నారు జనాలు.. డే ఒన్‌ హిందీ సినిమాల పేర్ల మీదున్న రికార్డులను తుడిచిపెట్టేసింది ధురంధర్‌ అన్నది అందరూ గట్టిగా చెబుతున్న మాట. అన్నీ లాంగ్వేజెస్‌లో కలిపితే ఇప్పటిదాకా పుష్ప2 పేరు మీద కలెక్షన్ల రికార్డు ఉంది. దాన్ని ఫాలో అయిన లిస్టులో ఇప్పుడు ధురంధర్‌ ఫ్లాష్‌ అవుతోంది. సినిమా అంటే ఇలా ఉండాలి.. ఇదీ మేం కోరుకున్న సినిమా.. ఏమన్నా తెరకెక్కించారా? అంటూ నార్త్, సౌత్‌ తేడా లేకుండా అందరూ మెచ్చుకుంటున్నారు. మన దగ్గర తారక్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, రామ్‌గోపాల్‌వర్మ లాంటి వారు మెచ్చుకున్నతీరు వైరల్‌ అవుతోంది. ఇప్పుడున్న వేగాన్ని బట్టి చూస్తే, ఈ వీకెండ్‌కి నెట్‌ 325 కోట్ల నుంచి 375 కోట్ల దాకా ఉండే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. నియర్‌ ఫ్యూచర్‌లో ఈ పోటీకొచ్చే పెద్ద సినిమాలు కూడా లేవు.. పైగా క్రేజ్‌ కూడా భీభత్సంగా ఉంది కాబట్టి, క్లోజింగ్‌ కలెక్షన్స్ ఊహాతీతం అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..

Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు

వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు

ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది

ఎల్బీనగర్‌లో హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి

Follow Us