AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spider-Man: ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్

Spider-Man: ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 5:50 PM

Share

గ్లోబల్ హాలీవుడ్ సినిమాల్లో స్పైడర్‌ మ్యాన్, అవతార్‌కి ప్రత్యేక స్థానం. అయితే, అవతార్ 3కి మునుపటి క్రేజ్ లేకపోవడం, నాలుగో భాగంపై సందిగ్ధత నెలకొనగా, రాబోయే స్పైడర్‌ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. జులై 31న విడుదల కానున్న ఈ సినిమాపై మార్వెల్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. స్పైడర్‌ మ్యాన్ సవాళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

హాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు రిలీజ్‌ అయినా గ్లోబల్‌ రేంజ్‌లో అట్రాక్షన్‌ ఉన్న కాన్సెప్టులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో అవెంజెర్స్, అవతార్‌, స్పైడర్‌ మేన్‌కి కూడా ప్రామినెంట్‌ ప్లేస్‌ ఉంటుంది. రీసెంట్ గా అవతార్‌ రిలీజ్‌ అయితే.. త్వరలో స్పైడర్‌మేన్‌ డేట్‌ లాక్‌ చేసుకుంది. ఇంతకీ ఈ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌ చూసి ఆడియెన్స ఏమంటున్నారు? అవతార్‌ సినిమా చూసినప్పుడు ఉన్న ఎగ్జయిట్‌మెంట్‌ అవతార్‌ 3 చూసిన జనాల్లో లేదు. ఫోర్త్ పార్ట్ ఉంటుందా? లేదా? అని అడిగితే ఆన్సరే లేదు ఇప్పుడు జేమ్స్ కామరన్‌ దగ్గర. చూద్దాం.. ఆలోచిద్దాం.. నిర్ణయిద్దాం అనే అంటున్నారు తప్ప, యస్‌.. ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్‌ రెడీ చేస్తున్నామనే మాట రావడం లేదు. అవతార్‌ కి పెద్దగా రెస్పాన్స్ లేని ఈ టైమ్‌ లో స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే ట్రైలర్‌ జనాలను కాస్త ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఎక్స్ పెక్టేషన్స కి తగ్గట్టే ఉండేలా ఉందంటున్నారు మార్వెల్‌ ఆడియన్స్. సోషల్‌ మీడియాలో మిలియన్‌ వ్యూస్‌తో ట్రైలర్‌ దూసుకుపోతుండటంతో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అవుతోంది. ఈ ఏడాది జులై 31న రిలీజ్‌ కానుంది స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే మూవీ. రెడ్‌ అండ్ బ్లూ సూట్‌లో పీటర్‌ చేయబోయే మేజిక్‌ని స్క్రీన్‌ మీద విట్‌నెస్‌ చేయడానికి రెడీ అవుతున్నారు ఆడియన్స్. కాకపోతే స్పైడర్‌మ్యాన్‌కి ఎదురయ్యే సవాళ్లు, వాటిని అతను అధిగమించే తీరు ఎంత ఆసక్తికరంగా చూపిస్తారన్నదే ఇప్పుడు డిస్కషన్‌లో ఉన్న పాయింట్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్

దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..

Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు

వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు

ఫామ్ హౌస్ కాల్పుల వెనుక ఏం జరిగింది

Follow Us