రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు! ఎక్స్‌లో సరికొత్త AI ఫీచర్
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ (X) 'AI-పవర్డ్ ఆర్టికల్ సమ్మరీస్', 'వాయిస్ లిజన్' ఫీచర్లను ప్రవేశపెట్టింది. గ్రోక్ AI ద్వారా పనిచేసే ఈ ఫీచర్లు పెద్ద కథనాలను సంక్షిప్తంగా అందిస్తాయి, లేదా చదవకుండా వినే సౌలభ్యం కల్పిస్తాయి. సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా, ప్రస్తుతం ఇవి ప్రీమియం, ప్రీమియం ప్లస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘AI-పవర్డ్ ఆర్టికల్ సమ్మరీస్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు పెద్ద కథనాలను పూర్తిగా చదవకుండా, ముఖ్యాంశాలను బుల్లెట్ పాయింట్ల రూపంలో తక్షణమే తెలుసుకోవచ్చు. యూజర్ ఒక ఆర్టికల్‌ను ఓపెన్ చేసి సమ్మరైజ్ బటన్‌ను నొక్కితే, AI వెంటనే ఆ కంటెంట్‌ను సంక్షిప్తంగా అందిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కంటెంట్‌ను వేగంగా చదవాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ సారాంశ ఫీచర్‌తో పాటు, వాయిస్ ఆధారిత లిజన్ అనే ఆప్షన్‌ను కూడా ప్లాట్‌ఫారమ్ జోడించింది. ఇది గ్రోక్ AI టెక్నాలజీతో పనిచేస్తూ, యూజర్లు ఇతర పనులు చేస్తూనే ఆర్టికల్‌ను వినే సౌలభ్యం కల్పిస్తుంది. కొంతమంది ఈ ఫీచర్ సమయాన్ని ఆదా చేస్తుందని, కంటెంట్‌ను సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుందని అభినందిస్తున్నారు. అయితే మరికొందరు పూర్తి కథనం చదవాలనే ఆసక్తి తగ్గిపోవచ్చని, లేదా ముఖ్యమైన అంశాలు ముందే తెలిసిపోవడం వల్ల అనుభవం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫీచర్లు ప్రీమియం, ప్రీమియం ప్లస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ప్రీమియం ప్లాన్ ధర నెలకు సుమారు రూ.427 కాగా, ప్రీమియం ప్లస్ రూ.2,570గా ఉంది. పరిమిత కాలానికి డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. గత కొద్ది నెలల్లో ఆర్టికల్ ఎంగేజ్‌మెంట్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, AI ఆధారిత ఫీచర్లతో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై ఎక్స్ దృష్టి సారించింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
