AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ప్రమాదంలో కోహ్లీ భారీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన ఐదుగురు..?

IPL 2026 Most Runs Record Players: క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న కొత్త సీజన్ మరో వారంలో మొదలుకానుంది. ప్రతిసారి లాగే ఈసారి కూడా భారీగా పరుగులు, కొత్త రికార్డుల కోసం ఆసక్తి పెరిగింది. దాదాపు పది సంవత్సరాలుగా నిలిచిన ఒకే సీజన్ అత్యధిక పరుగుల రికార్డ్.. ఈసారి బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IPL 2026: ప్రమాదంలో కోహ్లీ భారీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన ఐదుగురు..?
Ipl 2026 Most Runs
Venkata Chari
|

Updated on: Mar 22, 2026 | 9:20 AM

Share

IPL 2026 Most Runs Record Players: 2016లో విరాట్ కోహ్లీ ఒకే సీజన్‌లో 973 పరుగులు సాధించి అరుదైన చరిత్ర సృష్టించాడు. ఆ సీజన్‌లో అతని సగటు 81.08 కాగా నాలుగు శతకాలు, ఏడు అర్ధశతకాలు సాధించాడు. ఇప్పటి వరకు ఎవరూ ఈ రికార్డును అధిగమించలేకపోయారు.

అద్భుతమైన ఫామ్‌లో సంజు శాంసన్..

భారత ఓపెనర్ సంజు శాంసన్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ పోటీలో అతని ప్రదర్శన విశేషంగా నిలిచింది. తక్కువ మ్యాచ్‌లలోనే భారీ పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఫామ్ కొనసాగితే అతను రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.

విరాట్ కోహ్లీ మళ్లీ చరిత్ర సృష్టిస్తాడా..?

విరాట్ కోహ్లీ గత సీజన్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. నిరంతర స్థిరత్వం అతని బలం. అతను మళ్లీ తన రికార్డును తానే చెరిపేసే సామర్థ్యం కలిగి ఉన్నాడు. అనుభవం, పరుగుల ఆకలి కలిస్తే మరో చరిత్ర సాధ్యమే.

ఐడెన్ మార్క్రమ్ స్థిరమైన ప్రదర్శన..

దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన పోటీల్లో అతని ప్రదర్శన స్థిరంగా ఉంది. ఓపెనర్‌గా ఎక్కువ బంతులు ఆడే అవకాశం ఉండటం అతనికి భారీ స్కోర్లు సాధించడంలో సహాయపడుతుంది.

ఫిన్ అలెన్ దూకుడు ఆట..

న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ దూకుడు బ్యాటింగ్‌కు ప్రసిద్ధి. ప్రారంభ ఓవర్లలోనే భారీ షాట్లతో మ్యాచ్‌ను మార్చగలడు. అతని వేగం కొనసాగితే ఈ సీజన్‌లో భారీ పరుగులు నమోదు చేసే అవకాశం ఉంది.

వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్..

యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే తన ప్రతిభను నిరూపించాడు. అరంగేట్రంలోనే శతకం సాధించడం అతని ధైర్యాన్ని చూపించింది. దూకుడు ఆటతో అతను ఆశ్చర్యకర ఫలితాలు ఇవ్వగలడు.

ఈ సీజన్‌లో ఒకే సీజన్ అత్యధిక పరుగుల రికార్డు భంగపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఐదుగురు ఆటగాళ్లు తమ ఫామ్ కొనసాగిస్తే కొత్త చరిత్రకు సాక్ష్యం కావచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us