AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు.. ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్

Virat Kohli : ఐపీఎల్ 2026 సమరం మొదలవ్వకముందే మైదానంలో సెగలు పుడుతున్నాయి. గతేడాది ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి రజత్ పటిదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, విరాట్ కోహ్లీ ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు.

Virat Kohli : ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు.. ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
Virat Kohli
Rakesh
|

Updated on: Mar 21, 2026 | 5:26 PM

Share

Virat Kohli : ఐపీఎల్ 2026 సమరం మొదలవ్వకముందే మైదానంలో సెగలు పుడుతున్నాయి. గతేడాది ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది. ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు రంగంలోకి దిగారు. మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందే ఆర్సీబీ క్యాంప్‌లో కోహ్లీ ఇచ్చిన పెప్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్సీబీ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ చాలా సీరియస్‌గా కనిపిస్తున్నారు. “గత రెండు మూడు ఏళ్లుగా మనం పడ్డ కష్టానికి ఫలితంగానే గతేడాది కప్పు గెలిచాం. కానీ ఈసారి అది ఇంకా కష్టతరం కాబోతోంది. ఎందుకంటే మిగతా జట్లన్నీ మనపై పగతో ఊగిపోతూ విరుచుకుపడతాయి. అందుకే ప్రాక్టీస్ సెషన్‌లో ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు. రాబోయే రెండున్నర నెలలు మనమందరం 120 శాతం శ్రమించాలి” అంటూ తన టీమ్ మెయిన్‌సెట్‌ను మార్చేశారు. ఈ మాటలతో ఆర్సీబీ ప్లేయర్లు ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

రజత్ పటిదార్ సారథ్యంలో సరికొత్త ఆర్సీబీ

ఈ సీజన్‌లో ఆర్సీబీకి రజత్ పటిదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, విరాట్ కోహ్లీ ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఈసారి వేలంలో జట్టును మరింత పటిష్టం చేశామని ధీమా వ్యక్తం చేశారు. విరాట్, రజత్‌లతో కూడిన కోర్ గ్రూప్‌కు కొత్త ఆటగాళ్లు తోడవ్వడం జట్టుకు కలిసొచ్చే అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీ, ఈసారి కూడా అదే ఊపుతో సీజన్‌ను ప్రారంభించాలని చూస్తోంది.

చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన విరాట్ కోహ్లీ

ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డుకు విరాట్ కోహ్లీ అతి సమీపంలో ఉన్నారు. ఇప్పటివరకు 267 మ్యాచ్‌ల్లో 8,661 పరుగులు చేసిన విరాట్, ఈ సీజన్‌లో మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే ఎనిమిది సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ, గత మూడు సీజన్లలో వరుసగా 600కు పైగా పరుగులు చేయడం విశేషం. ఈసారి కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తే ఆర్సీబీ టైటిల్ డిఫెన్స్ సులభతరం అవుతుంది.

మార్చి 28న రసవత్తర పోరు

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కోహ్లీ బ్యాట్ నుంచి వస్తున్న మెరుపు షాట్లు చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. ఒకవైపు పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, భారత్‌లో మాత్రం ఐపీఎల్ ఫీవర్ పీక్స్‌కు చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..