AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??

కేదార్‌నాథ్ దర్శనానికి.. సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందేనా ??

Phani CH
|

Updated on: Mar 21, 2026 | 4:35 PM

Share

బద్రీ-కేదార్ ఆలయ కమిటీ (BKTC) నూతన నిబంధన ప్రకారం, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో హిందూయేతర సందర్శకులు ప్రార్థనలు చేయాలంటే 'సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను' అని లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలి. ఈ నిబంధన సారా అలీ ఖాన్‌ వంటి ప్రముఖులతో సహా అందరికీ వర్తిస్తుంది. ఆలయ సంప్రదాయాలను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది కేవలం పర్యాటక కేంద్రాలు కాదని, విశ్వాస కేంద్రాలని కమిటీ పేర్కొంది. బీకేటీసీ పరిధిలోని 47 ఆలయాలకూ విస్తరించే యోచన ఉంది.

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌ భవిష్యత్తులో కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటే ఇకపై అఫిడవిట్ సమర్పించాల్సి రావచ్చు. ఎందుకంటే.. బద్రీ-కేదార్ ఆలయ కమిటీ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, హిందూయేతర సందర్శకులు ఈ ఆలయాల్లో ప్రార్థనలు చేయాలంటే తాము సనాతన ధర్మాన్ని నమ్ముతున్నామని లిఖితపూర్వక ప్రకటన ఇవ్వడం తప్పనిసరి. ఆలయ కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది ఏం చెప్పారంటే.. “ఎవరైనా హిందూయేతరులకు సనాతన ధర్మంపై నమ్మకం ఉంటే, వారు ‘నేను సనాతనిని, హిందుత్వాన్ని విశ్వసిస్తాను’ అని అఫిడవిట్ సమర్పించాలి. అటువంటి వారికి మాత్రమే ఆలయంలో దర్శనానికి, ప్రార్థనలకు అనుమతి ఉంటుంది” అని స్పష్టం చేశారు. ఈ నిబంధన కేవలం సారా అలీ ఖాన్‌కే కాకుండా, ఇతర మతాలకు చెందిన భక్తులందరికీ సమానంగా వర్తిస్తుందని ఆయన అన్నారు. సారా అలీ ఖాన్ తన మొదటి సినిమా ‘కేదార్‌నాథ్’ షూటింగ్ సమయం నుంచి ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. శివునిపై తనకున్న భక్తిని చాటుకుంటూ ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఫోటోలను కూడా షేర్‌ చేస్తారు. అయితే, ఆమె గత పర్యటనల నేపథ్యంలో ద్వివేది స్పందిస్తూ.. “సారా అలీ ఖాన్‌కు సనాతన ధర్మంపై భక్తి ఉండి, ఆమె అఫిడవిట్ సమర్పిస్తే ఖచ్చితంగా ప్రార్థనలకు అనుమతిస్తాం” అని తెలిపారు. ఆలయ సంప్రదాయాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ తెలిపింది. కేదార్‌నాథ్ , బద్రీనాథ్ ఆలయాల్లోకి ఇకపై కేవలం హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. హిందువులు కాని వారు ఈ ఆలయాల్లోకి ప్రవేశించడానికి వీలు లేకుండా నిషేధం విధించాలని స్వయంగా బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ బీకేటీసీ ఛైర్మన్ అన్నారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలతో పాటు.. బీకేటీసీ పరిధిలోకి వచ్చే మరో 47 ఆలయాల్లో కూడా హిందువులు కాని వారిని ప్రవేశించకుండా నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదనను త్వరలో బీకేటీసీ బోర్డు ముందు ఉంచే అవకాశం ఉంది. “దీనిని ఆదిశంకరాచార్యుల కాలం నుంచీ పాటిస్తున్నారనీ. మతపరమైన సంప్రదాయాలను కాపాడుకోవడంలో తప్పులేదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ధామ్‌లు పర్యాటక కేంద్రాలు కావు, అవి విశ్వాస కేంద్రాలు అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం

ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌

ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు

Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా

గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా

Follow Us