AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం

Kim Jong Un: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు.. నెక్స్ట్ టార్గెట్ ఏ దేశం

Phani CH
|

Updated on: Mar 21, 2026 | 1:27 PM

Share

అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేసింది. కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు-యే ట్యాంక్ స్వారీ చేస్తూ కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామం ఆమెను కిమ్ వారసురాలిగా చూపిస్తోందా అనే ఊహాగానాలకు తావిచ్చింది. దక్షిణ కొరియా నిఘా సంస్థలు దీనిని బలపరుస్తుండగా, ఉత్తర కొరియా రాజకీయాల్లో మహిళా నాయకత్వంపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా తమ యుద్ధ సన్నాహాలను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ స్వయంగా సైనిక శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముఖ్యంగా ట్యాంక్ యూనిట్‌లు, ఇన్‌ఫాంట్రీ దళాలు నిర్వహించిన లైవ్ ఫైరింగ్ డ్రిల్స్‌ను ఆయన సమీక్షించినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఉత్తర కొరియా సైనిక విన్యాసాల్లో దేశాధినేత కిమ్ తన కుమార్తె కిమ్‌-జు-యేతో కలిసి పాల్గొన్నారు. కేవలం ఆమె వీక్షకురాలిగానే కాకుండా, ట్యాంక్‌పై స్వారీ చేస్తూ కనిపించడం విశేషంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో కిమ్-జు-యే మరోసారి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. సుమారు 13 ఏళ్ల వయసున్న జు-యే, గత కొంతకాలంగా క్షిపణి పరీక్షలు, మిలిటరీ పరేడ్‌ల వంటి కీలక అధికారిక కార్యక్రమాల్లో తండ్రి వెంటే ఉంటోంది. గురువారం నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో ట్యాంక్ దళాలు, కాలినడక దళాలు సమన్వయంతో యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. తాజాగా ఆర్మీ డ్రిల్స్‌ను పర్యవేక్షించిన కిమ్, యుద్ధ సన్నాహాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2022 నుంచి వరుసగా ప్రాధాన్యత దక్కుతుండటంతో, కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా జు-యేనే ప్రకటిస్తారని దక్షిణ కొరియా నిఘా సంస్థలు సైతం అంచనా వేస్తున్నాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఆమెకు లభిస్తున్న గౌరవం చూస్తుంటే ఉత్తర కొరియా పగ్గాలు ఆమె చేతికి వెళ్లడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన కుమార్తెను వారసురాలిగా ప్రకటించే దిశగా క్రమంగా ముందుకెళ్తున్నారని అవి భావిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఆమెను అత్యంత ప్రియమైన కుమార్తెగా పేర్కొనడం కూడా ఈ అంచనాలకు బలం చేకూర్చుతోంది. అయితే, కొంతమంది నిపుణులు ఈ అభిప్రాయాలను పూర్తిగా సమర్థించడం లేదు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇంకా యువకుడే కావడం, ఉత్తర కొరియాలో రాజకీయ వ్యవస్థ చాలా వరకు పురుషాధిక్యంగా ఉండటం వంటి అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా వారసురాలిని ముందుకు తీసుకురావడం అంత సులభం కాదని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌

ఆన్‌లైన్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు

Beetroot: బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా

గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా

బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం

Follow Us