బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
నెల్లూరు జాతీయ రహదారిపై కూల్ డ్రింక్ లారీ ప్రమాదం జరిగింది. డ్రైవర్ ప్రాణాపాయంలో ఉండగా, ప్రజలు సహాయం చేయకుండా రోడ్డుపై పడిన బాటిళ్లను ఎత్తుకెళ్లడానికి పోటీపడ్డారు. అరగంటలోనే లారీలోని సరుకంతా మాయం కావడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఉచితం ఆశతో మానవత్వం మరిచిన ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పుందా’ అని అడిగిన సామెతను జనం నిజం చేశారు. రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తా పడి డ్రైవర్ ప్రాణాపాయంలో ఉంటే.. స్థానికులు మాత్రం సాయం చేయడం మానేసి, రోడ్డుపై పడ్డ సరుకును ఎత్తుకెళ్లడంలో పోటీ పడ్డారు. నెల్లూరు నగర శివార్లలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై శుక్రవారం ఒక లారీ కూల్ డ్రింక్ బాటిళ్ల లోడుతో వెళ్తోంది. అదుపుతప్పిన లారీ ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై బోల్తా పడింది. లారీలో ఉన్న కూల్ డ్రింక్ బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అన్నీ ప్లాస్టిక్ బాటిళ్లు కావడంతో ప్రమాదం ధాటికి అవన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే చుట్టుపక్కల జనం భారీగా అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చింది ప్రమాద బాధితులను రక్షించడానికి కాదండోయ్.. రోడ్డుపై పడ్డ కూల్ డ్రింక్ బాటిళ్లను ఏరుకోవడానికి! స్థానికులే కాకుండా, అటుగా కార్లు, బైక్‌లపై వెళ్తున్న వారు సైతం వాహనాలు ఆపి మరీ బాటిళ్లను డిక్కీల్లో నింపుకుని వెళ్లడం విశేషం. కొందరైతే ఏకంగా లారీ పైకి ఎక్కి మరీ లోపల ఉన్న బాటిళ్లను సైతం ఊడ్చుకెళ్లిపోయారు. కేవలం అరగంట వ్యవధిలోనే లారీలోని సరుకంతా మాయమైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేద్దామని వచ్చేసరికి.. అక్కడ ఒక్క మనిషీ లేడు.. ఒక్క బాటిల్ కూడా రోడ్డుపై కనిపించలేదు. జనం చూపిన ఆ ‘వేగం’ చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. మానవత్వం మరచి కేవలం ఉచితంగా వస్తున్నాయన్న ఆశతో బాటిళ్ల కోసం ఎగబడిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరికి పోలీసులు ఖాళీ లారీని అక్కడి నుంచి తొలగించి కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారి
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం
గ్యాస్ కష్టాలకు ‘రాకెట్’ పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

