సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. తమ పిల్లలు ఎలా ఉన్నారనే తల్లిదండ్రుల బెంగ, అలాగే వారి భద్రతపై పిల్లల ఆందోళన సర్వసాధారణం. దీనికి పరిష్కారంగా, శివానీ శుక్లా తన తల్లిదండ్రుల ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయగా, వారు కెమెరా ముందుకొచ్చి ప్రేమగా పలకరించిన వీడియో వైరల్ అయ్యింది. ఇది దూరం తగ్గించి, సాంకేతికతతో అనుబంధాన్ని బలపరిచే గొప్ప ఉదాహరణ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంతో తప్పనిపరిస్థితుల్లో అయినవారికి దూరంగా గడిపేవారు చాలామంది. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో సొంత ఊరిని, కన్నవారిని వదిలి వెళ్లడం అనివార్యమైపోయింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మనాన్నల అలనా పాలన చూసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక తమది కాని ప్రదేశంలో తమ పిల్లలు ఎలా ఉంటున్నారు? ఏం తింటున్నారో అనే బెంగ తల్లిదండ్రులను వేధిస్తుంటుంది. తాజాగా తన పేరెంట్స్ కు దూరంగా ఉంటున్న ఓ కూతురు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఇది చూసిన వారంతా తల్లిదండ్రుల ప్రేమకు ఫిదా అవుతున్నారు. శివానీ శుక్లా అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ తల్లిదండ్రులకు దూరంగా వేరే నగరంలో ఉండాల్సి వచ్చింది. దీంతో తాను దూరంగా ఉంటే ఇంట్లో తన తల్లిదండ్రులు సేఫ్టీ ఎలా? అనే బెంగ ఆవిడను వేధించింది. ఆ క్రమంలో ఇంట్లో సర్వైలెన్స్ కెమెరాను ఏర్పాటు చేయించగా ఈ నిర్ణయం ఆమెకు మంచి అనుభూతిని మిగిల్చింది. సీసీ కెమెరా ఏర్పాటు చేయించి వేరే ప్రాంతానికి వెళ్లిన తర్వాత శివాని తల్లిదండ్రులు ఆ కెమెరాకు ఎదురుగా వచ్చి లెన్స్ లోకి చూస్తూ ఆమెను పలకిస్తున్నట్లు చేతులు ఊపడం, సమయానికి తిన్నావా అంటూ సైగలు చేయడం చేస్తున్నారు. సీసీ సీసీ కెమెరా ముందు తన తల్లిదండ్రుల పలకరింపులకు సంబంధించిన వీడియోను శివానీ తాజా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇంట్లో సీసీ టీవీ ఇన్ స్టాల్ చేయడం తన జీవితంలో తీసుకున్నమంచి నిర్ణయం అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తల్లిదండ్రులు పలకరింపులను చూసి ఫిదా అవుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమకు భాష అక్కర్లేదని దూరంగా ఉన్నా గుండెల్లో ఎప్పుడు తరగని ప్రేమను నింపుకుంటారని కామెట్ చేస్తున్నారు. ఈ పోస్టుకు నెటిజన్లు ఇప్పటివరకు రెండున్నర లక్షల లైక్‌లు ఇచ్చారు. ఈ రోజుల్లో ఎంత దూరంలో ఉన్నా.. ఒక చిన్న కెమెరాతో మన ఆత్మీయులతో ఎప్పుడూ టచ్‌లో ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం
గ్యాస్ కష్టాలకు ‘రాకెట్’ పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!

