గ్యాస్ కష్టాలకు ‘రాకెట్’ పరిష్కారం.. రిటైర్డ్ ఇంజనీర్ అద్భుత ఆవిష్కరణ
గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో, బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఇంజినీర్ అశోక్ ఉర్స్ రూపొందించిన 'రాకెట్ స్టవ్' ప్రత్యామ్నాయంగా మారింది. ఈ స్టవ్ చిన్న కొమ్మలు, వ్యర్థాలను ఇంధనంగా వాడుతుంది, తక్కువ పొగతో వేగంగా వంట చేస్తుంది. కేవలం రూ. 3,000 ధరతో పర్యావరణానికి మేలు చేస్తూ, గ్యాస్ అవసరం లేకుండా వంట చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఇది గ్రామీణ, వాణిజ్య అవసరాలకు ఆదర్శం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. హోటళ్లు మూతపడుతున్న తరుణంలో, బెంగళూరుకు చెందిన ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 65 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ అశోక్ ఉర్స్ రూపొందించిన ‘రాకెట్ స్టవ్’ ఇప్పుడు ఇంధన సంక్షోభానికి పరిష్కారం చూపుతోంది. సాధారణంగా పల్లెల్లో వాడే కట్టెల పొయ్యిల వల్ల విపరీతమైన పొగ వస్తుంది, పైగా ఎక్కువ కట్టెలు ఖర్చవుతాయి. కానీ, అశోక్ ఉర్స్ తయారు చేసిన ఈ స్టవ్ ‘L’ ఆకారంలో ఉంటుంది. ఇందులో గాలి ప్రసరణ చాలా వేగంగా జరుగుతుంది. దీని కోసం ఖరీదైన బొగ్గు లేదా గ్యాస్ అక్కర్లేదు. చిన్న చిన్న ఎండిన కొమ్మలు, కొబ్బరి చిప్పలు, ఎండిన ఆకులు లేదా వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా వాడవచ్చు. ఈ డిజైన్ వల్ల మంట చాలా వేగంగా, ఎక్కువ వేడితో వస్తుంది. దీనివల్ల పొగ చాలా తక్కువగా వస్తుంది, వంట కూడా గ్యాస్ స్టవ్ మీద చేసినంత వేగంగా పూర్తవుతుంది. దీని ధర కేవలం రూ. 3,000 మాత్రమే కావడంతో సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది. మొదట్లో గ్రామీణ మహిళల కోసం రూపొందించిన ఈ స్టవ్, ఇప్పుడు బెంగళూరులోని పెద్ద పెద్ద రెస్టారెంట్ యజమానుల దృష్టిని ఆకర్షించింది. గ్యాస్ సిలిండర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే బదులు, ఈ రాకెట్ స్టవ్‌లను తమ కమర్షియల్ కిచెన్లలో వాడటానికి వారు ఆసక్తి చూపుతున్నారు. “నిజ జీవిత సమస్యల నుండే గొప్ప ఆవిష్కరణలు పుడతాయి” అని అశోక్ ఉర్స్ నిరూపించారు. గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో, ఇటువంటి దేశీ ఆవిష్కరణలే మనకు శ్రీరామరక్ష. అందుకే అశోక్ ఉర్సు రాకెట్ స్టౌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gas Crisis: గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..
మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!

