మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై తీర్పు సోమవారానికి వాయిదా పడింది. కోర్టు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది, రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, దుబాయ్ సంబంధాలపై దృష్టి సారించింది. డ్రగ్స్ పార్టీ మూలాలు, నిర్వహణ ఉద్దేశ్యంపై ఆరా తీస్తోంది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులు రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మల కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈరోజు, రేపు కోర్టుకు సెలవులు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిందితులను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వెనుక ఉన్న మూలాలపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ సప్లయర్‌లతో అతని సంబంధాలపై సిట్ దృష్టి సారించింది. డ్రగ్స్ పార్టీ నిర్వహణకు గల ప్రధాన ఉద్దేశ్యంపై సిట్ ఆరా తీస్తోంది. రోహిత్ రెడ్డి దుబాయ్ సంబంధాలపైనా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్, పుట్టా మహేష్ మినహా ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేసింది. కస్టడీ లభిస్తే నిందితులను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక
Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

