AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్కార్‌ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!

ఆస్కార్‌ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 8:27 PM

Share

లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఈసారి మన దేశానికి అవార్డులు రాకపోయినా, 'నాటు నాటు' విజయం స్ఫూర్తితో భారతీయ సినిమా గ్లోబల్ స్థాయిలో పోటీ పడేందుకు కృషి చేస్తోంది. 'వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌' ఆరు ఆస్కార్‌లను గెలుచుకుని వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆస్కార్‌.. ఆస్కార్‌.. ఆస్కార్‌… సినిమా వాళ్లకి పట్టరాని ఆనందం కలిగినప్పుడు ఆస్కార్‌ వచ్చినంత ఆనందంగా ఉందని అంటుంటారు. నిజంగా ఆస్కార్‌ వస్తే.. ఈ సారి మన వాళ్లకు రాలేదు గానీ, నిజంగా ఆస్కార్‌ అందుకున్న వాళ్ల ఆనందాలకు అంతే లేదు.. ఇంతకీ ఆస్కార్‌ వేడుక ఎలా జరిగింది. మన నాటు నాటు పాటకి ఆస్కార్‌ వచ్చినప్పటి నుంచి మన వారు ఆ అవార్డులు వచ్చే టైమ్‌కి చాలా బాగా అలర్ట్ అవుతున్నారు. యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్‌ అవార్డుల సంబరం ఈ ఏడాది కూడా అంగరంగవైభవంగా జరిగింది. ఆస్కార్‌ అవార్డుల వేడుకకు లాస్‌ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌ వైదికైంది. 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుకకు హాలీవుడ్‌ కమెడియన్‌ కోనన్‌ ఓబ్రియన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్ పురస్కారాన్ని మన దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా అందించారు. ఒన్ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌, సిన్నర్స్ సినిమాలకు అవార్డుల పంట పండింది. వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ మూవీ ఆరు విభాగాల్లో ఆస్కార్‌ పురస్కారాలు దక్కించుకోవడం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. వచ్చే ఆస్కార్లలో అయినా మన సినిమాలు పోటీ పడాలని, మన ప్రతిష్టను ఇంటర్నేషనల్‌ డయాస్‌ మీద చాటాలని జనాలు కోరుకుంటున్నారు. ఆ రేంజ్‌ సినిమాలను నిర్మించడానికి మన మేకర్స్ కూడా ఇష్టంగా కష్టపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ సూర్య రిస్క్ చేస్తున్నారా

రూ.5 లక్షల్లో బాహుబలి రేంజ్ సినిమా.. RGV ఏం చెప్పాలనుకుంటున్నారు ??

వింటేజ్ లుక్ ని ట్రై చేస్తున్న నార్త్ బ్యూటీస్

Maharaja 2: మహారాజా సీక్వెల్‌.. సేతుపతి సిగ్నల్‌ ఇచ్చేసినట్టేనా

Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్

Follow Us