వింటేజ్ లుక్ ని ట్రై చేస్తున్న నార్త్ బ్యూటీస్
నార్త్ బ్యూటీస్ తమన్నా, కియారా, శ్రద్ధా కపూర్ ప్రస్తుతం బయోపిక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమర్షియల్ పాత్రలకు భిన్నంగా, చారిత్రక పాత్రల్లో జీవించేందుకు ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు. జయశ్రీ, మీనా కుమారి, విటాబాయ్ వంటి అలనాటి దిగ్గజాల పాత్రలు పోషిస్తున్న ఈ తారలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. వారి వింటేజ్ టర్న్ సినిమా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బయోపిక్ సినిమాలలో నటించడం కమర్షియల్ చిత్రాల కన్నా భిన్నంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక పాత్రలో జీవించడానికి విస్తృతమైన హోంవర్క్, పరిశోధన అవసరమని నార్త్ భామలు భావిస్తున్నారు. ప్రస్తుతం మధుబాల బయోపిక్ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఇతర బయోపిక్‌లలో నటిస్తున్న నార్త్ హీరోయిన్‌ల పైన దృష్టి పడింది. హీరోయిన్ తమన్నా, లెజెండరీ బాలీవుడ్ దర్శకుడు వి. శాంతారాం బయోపిక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె అలనాటి అందాల నటి జయశ్రీగా తెరపై కనిపించనున్నారు. క్రేజీ బ్యూటీ కియారా అద్భుతమైన బయోపిక్ కోసం సిద్ధమవుతున్నారు. ప్రసవ విరామంలో ఉన్న కియారా త్వరలో కెమెరా ముందుకు వచ్చి లెజెండరీ హీరోయిన్ మీనా కుమారి పాత్రలో టైటిల్ రోల్ పోషించనున్నారు. మరో నార్త్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా బయోపిక్ మూవీలో నటించడానికి సన్నద్ధమవుతున్నారు. మరాఠీ కళాకారిణి విటాబాయ్ పాత్రలో నటించడానికి ఆమె శిక్షణ తీసుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Maharaja 2: మహారాజా సీక్వెల్.. సేతుపతి సిగ్నల్ ఇచ్చేసినట్టేనా
Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్
చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

