AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి

పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి

Phani CH
|

Updated on: Mar 20, 2026 | 5:46 PM

Share

జనగామ మున్సిపల్ అధికారులు పట్టణ గోడలపై అక్రమ పోస్టర్లు, రాతల సమస్యకు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. జరిమానాలకు బదులుగా, ప్రభుత్వ కార్యాలయాలు, బ్రిడ్జిల గోడలకు రంగులు వేసి, పూల కుండీలతో 'గ్రీన్ వాల్స్'గా మార్చారు. ఈ పచ్చని గోడలు నగరాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, పర్యావరణానికి మేలు చేస్తూ స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నాయి.

పట్టణాల్లో ఖాళీ గోడ కనిపిస్తే చాలు.. సినిమా పోస్టర్లు, రాజకీయ నేతల ఫ్లెక్సీలు, వ్యాపార ప్రకటనల రాతలతో నింపేయడం చూస్తుంటాం. దానివల్ల గోడలు అందవిహీనంగా ఉండటం.. చూడ్డానికి పాత గోడల్లా కనిపించడంతో మున్సిపల్‌ అధికారులు దీనికి ఎలాగైనా చెక్‌ పెట్టాలనుకున్నారు. అందుకోసం వినూత్నంగా ఆలోచించారు. ఈ ‘గోడ రాతల’ గోల నుంచి జనగామ పట్టణానికి విముక్తి కలిగించడానికి అద్భుతమైన ఐడియాను అమలు చేశారు. గోడలపై పోస్టర్లు వేయకుండా, వాటిని పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్ది అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణంగా గోడలపై రాతలు రాస్తే జరిమానాలు విధిస్తారు. కానీ, జనగామ అధికారులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్రిడ్జిల గోడలకు రంగులు వేసి, వాటికి వరుసగా పూల కుండీలను వేలాడదీస్తున్నారు. ముఖ్యంగా జనగామ-సిద్దిపేట రహదారిపై ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద గోడలకు ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలను అమర్చారు. నిత్యం పోస్టర్లతో అసహ్యంగా కనిపించే గోడలు ఇప్పుడు పచ్చని మొక్కలు, విరబూసిన పూలతో పర్యాటకులను, వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇంత అందంగా ఉన్న గోడలపై పోస్టర్లు వేయడానికి ఎవరికైనా మనసు ఒప్పదు కదా! అధికారుల ఈ నిర్ణయం వల్ల అటు పట్టణానికి అందం రావడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. ఈ ‘గ్రీన్ వాల్’ కాన్సెప్ట్ చూసిన స్థానికులు “మున్సిపల్ అధికారులు భలే ఐడియా వేశారు” అంటూ అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..

మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!

నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!

ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది

వరల్డ్‌ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..

Follow Us