AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది

ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది

Phani CH
|

Updated on: Mar 20, 2026 | 5:21 PM

Share

టాలీవుడ్ నటుడు శివారెడ్డి, ఒకప్పుడు మిమిక్రీతో మెరిసినా, ఇప్పుడు నటన అవకాశాల కోసం పోరాడుతున్నారు. దర్శకులు తనను దూరం పెడుతున్నారని ఆవేదన చెందారు. మిమిక్రీ ఇమేజ్ నటనకు అడ్డుగా మారిందన్న శివారెడ్డి, కష్టపడే గుణం ఎప్పటికైనా గెలుస్తుందని నమ్ముతున్నారు. ఆయన సినీ ప్రయాణం, సవాళ్లు, ఆశలు ఈ కథనంలో చూడండి.

టాలీవుడ్ నటుడు, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనేక అనుభవాలను, సవాళ్లను, ఇతర కళాకారులకు అందించిన సహాయాన్ని పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభ దశలో ఎంతోమందికి సినిమా అవకాశాలు, స్టేజ్ షోలు ఇప్పించినట్లు, వారిని తన కారులో తీసుకెళ్లి ప్రోగ్రాములలో జోక్స్ ఎలా చేయాలనేది నేర్పించినట్లు తెలిపారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు ఇప్పుడు వచ్చినా, తాను అంతకు ముందే కమెడియన్లను, ఆర్టిస్టులను తీసుకెళ్లి జుగల్బందీ తరహా ప్రోగ్రామ్స్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. నటుడిగా అవకాశాల కోసం తాను నిరంతరం ప్రయత్నిస్తున్నానని శివారెడ్డి తెలిపారు. దర్శకుడు శ్రీను వైట్ల ‘దూకుడు’ సినిమా తర్వాత నుంచి తనకు అవకాశాలు రాలేదని, తన టీమ్‌లోని గోపి మోహన్‌కు ఇప్పటికీ అవకాశాల కోసం మెసేజ్‌లు పెడుతూనే ఉంటానని చెప్పారు. అయితే, కొంతమంది దర్శకులు “నెక్స్ట్ ఇయర్”, “నెక్స్ట్ సినిమా” అని చెప్పి కాలం వెళ్ళదీస్తుంటారని, మరికొందరు స్పందిచరని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాల కోసం ఆఫీస్‌లకు వెళ్తే “మీరెందుకు వచ్చారు, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా” అంటారని, ఫోన్ చేస్తే “నేను చెప్తానులే” అని తీసిపారేస్తారని వాపోయారు. అయినప్పటికీ మంచితనం, కష్టపడే గుణం ఎప్పటికైనా గెలుస్తాయని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన మిమిక్రీ ఇమేజ్, నటన అవకాశాలను డామినేట్ చేస్తోందని శివారెడ్డి అభిప్రాయపడ్డారు. తన విషయంలో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా వచ్చిన పేరు నటుడిగా తనను గుర్తించడానికి అడ్డంకిగా మారిందని అన్నారు. తన ఇంటి గురించి చాలామంది ప్రస్తావిస్తుంటారని, అయితే సుడిగాలి సుధీర్ వంటి కమెడియన్లు కూడా రెండేసి, మూడేసి ఇళ్లు కలిగి ఉన్నారని అన్నారు. సుడిగాలి సుధీర్ తన దగ్గర మొదటి ఫ్లాట్‌ను చాలా తక్కువ ధరకే కొన్నాడని, ఆ ఫ్లాట్‌లో అవార్డులు పెట్టుకోవడానికి ఎస్ ఆకారంలో ఇంటీరియర్స్ చేయించానని, అది శివారెడ్డి ఎస్ అనుకుంటే, సుడిగాలి సుధీర్ ఎస్ అయిందని సరదాగా చెప్పుకొచ్చారు. ఆర్థికంగా తాను ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాతే డబ్బు విలువ తెలుసుకొని, రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కొనుక్కున్నానని శివారెడ్డి తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరల్డ్‌ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..

వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..

Follow Us