AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!

మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!

Phani CH
|

Updated on: Mar 20, 2026 | 5:40 PM

Share

మకావులో ఓ హ్యూమనాయిడ్ రోబో వృద్ధురాలిని భయపెట్టిన సంఘటన చర్చనీయాంశమైంది. రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచే ఈ రోబో అకస్మాత్తుగా మహిళ వెనుక నిలబడి వింతగా ప్రవర్తించగా, భయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ వైరల్ వీడియో బహిరంగ ప్రదేశాల్లో రోబోల భద్రత, నియంత్రణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. రోబోల ఆపరేటర్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

టెక్నాలజీ యుగంలో మనుషులు చేసే పనులన్నీ చాలా వరకు రోబోలే చేసేస్తున్నాయి. కొన్నిసార్లు మనుషులు కూడా ఆశ్చర్యపోయేలా వాటి ప్రవర్తన ఉంటోంది. తాజాగా, చైనాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత వారం మకావులోని ఓ వీధిలో 70 ఏళ్ల వృద్ధురాలు మొబైల్ ఫోన్ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఆమె గుండె గుబేల్‌మనే ఘటన జరిగింది. 4 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న ఓ హ్యూమనాయిడ్ రోబో సడన్‌గా వచ్చి ఆమె వెనుకే నిలబడింది. అప్పటిదాకా ఫోన్‌లో మాట్లాడుతున్న మహిళ.. అనుమానం వచ్చి వెనక్కు తిరిగి చూసింది. మహిళను చూడగానే ఆ రోబో చేతులు పైకి ఎత్తి వింతగా ప్రవర్తించింది. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. ఆ వెంటనే తేరుకుని రోబోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు.. నీకు పిచ్చెక్కిందా?’’ అంటూ ఆమె రోబోపై కేకలు వేసింది. ఆమె భయం ఎంతలా ఉందంటే, చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాల్సి వచ్చింది. మహిళ ఆ రోబోతో చాలాసేపు వాదిస్తూ మండిపడింది. ఆ సమయంలో రోబో మాత్రం చేతులు పైకి కిందకు ఊపుతూ, అటూ ఇటూ కదులుతూ అక్కడే నిలబడింది. రోబో చేష్టలకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. సమాచారం అందుకున్న రోబో ఆపరేటర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సదరు మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆమెకు ఎలాంటి హానీ జరగలేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత పోలీసులు ఆ రోబోను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం సదరు ఆపరేటర్‌కు అప్పగించారు. బహిరంగ ప్రదేశాల్లో రోబోలను వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించి పంపించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఆ రోబో చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన అధునాతన మోడల్. ఆ రోబో మకావు ప్రాంతంలోని ఓ విద్యా కేంద్రానికి సంబంధించింది. ఆ విద్యా కేంద్రం నిర్వాహకులు.. నగరంలో ప్రచారం కోసం ఆ రోబోను వినియోగిస్తున్నారు. ఆ రోబో రిమోట్ కంట్రోల్‌లో నడుస్తోంది. దారిలో అడ్డంకులను తప్పించుకుని వెళ్లే సామర్థ్యం కూడా రోబోకు ఉంది. అయితే మార్గ మధ్యలో మహిళ ఉండడంతో ఆ రోబో ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయిందట. మహిళకు కలిగిన అసౌకర్యంపై సదరు రోబో ఆపరేటర్ క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!

ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది

వరల్డ్‌ కప్‌కు సెలక్ట్ చేయలేదనే కోపంతో సినిమాల్లోకి.. కట్ చేస్తే స్టార్ డైరెక్టర్‌గా..

వాటి మీద ఆసక్తితో.. భారీగా డబ్బును చేజార్చుకున్నాడు.. అయితే..

Follow Us