AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

చిన్న గింజలతో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

Phani CH
|

Updated on: Mar 20, 2026 | 5:51 PM

Share

అవిసె గింజలు పోషకాల గని. ఒమేగా-3, ఫైబర్ సమృద్ధిగా ఉండి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదలకు తోడ్పడతాయి. మలబద్ధకం, గ్యాస్ సమస్యలను నివారిస్తాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి, షుగర్ నియంత్రణకు ఉపకరిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. పొడిగా సలాడ్‌లు, పెరుగులో కలిపి రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే విత్తనం మన వంటింట్లోనే అందుబాటులో ఉందని మీకు తెలుసా.. అవును, చిన్నగా కనిపించే అవిసె గింజలు ఆరోగ్యానికి వరంలా పనిచేస్తాయి. శరీరాన్ని కాపాడడంలో, బలాన్ని ఇవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చూడటానికి చిన్నగా ఉండే ఈ గింజలు పోషకాల గని అని, వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా కీలకం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కేవలం గుండె ఆరోగ్యానికే కాకుండా, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ అవిసె గింజలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇక జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, అవిసె గింజల్లో ఉండే కరిగే, కరగని ఫైబర్‌ మలబద్దకం సమస్యను తగ్గిస్తాయి. కడుపు శుభ్రంగా ఉంచడంతో పాటు గ్యాస్, అజీర్ణం కూడా దూరమవుతుంది. రెగ్యులర్‌గా తీసుకునే వారు జీర్ణ సమస్యల నుంచి ఎక్కువగా రిలీఫ్ పొందుతారు. షుగర్ పేషెంట్లకు కూడా అవిసె గింజలు చాలా ఉపయోగకరం. వీటిలోని విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును బలంగా, మెరిసేలా మారుస్తాయి. చర్మాన్ని పొడిబారడం, ముడతలు, మచ్చలు వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. అందుకే వీటిని సహజమైన బ్యూటీ సీక్రెట్ అంటారు. పల్లెల్లో ఇప్పటికీ అమ్మమ్మలు అవిసె గింజల లడ్డూలు చేసి మనవళ్లకు పెట్టడం ఒక పరంపరగా కొనసాగుతోంది. ఇవన్నీ కాకుండా, అవిసె గింజల్లోని శక్తివంతమైన పదార్థాలు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అవిసె గింజలను నేరుగా తినడం కంటే పొడి చేసుకుని వాడటం మేలు. చిటికెడు పొడిని సలాడ్‌లో పెరుగులో, స్మూతీలలో లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకుని రోజుకు ఒకసారి తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం దిశగా అడుగులు వేయవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి

రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్‌ పేలడంతో..

మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!

నిమ్మరసానికి ‘గ్యాస్ ఛార్జ్’.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!

ఏం చేస్తాం.. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు సుడిగాలి సుధీర్ వశమైంది

Follow Us