AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్‌‌కు బిగ్ షాక్.. నటాంజ్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై మరోసారి అమెరికా – ఇజ్రాయెల్ వైమానిక దాడులు!

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. కీలకమైన నటాంజ్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై మరోసారి వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో తీవ్ర నష్టం జరగినట్టు తెలుస్తోంది. ఇరాన్ న్యూక్లియర్‌ బాంబును ఎట్టి పరస్థితుల్లో కూడా అడ్డుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్‌ న్యూక్లియర్‌ సామర్ధ్యాన్ని ఇప్పటికే ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు.

ఇరాన్‌‌కు బిగ్ షాక్.. నటాంజ్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై మరోసారి అమెరికా - ఇజ్రాయెల్ వైమానిక దాడులు!
Natanz Nuclear Facility Targeted In Us Israel Strike
Balaraju Goud
|

Updated on: Mar 21, 2026 | 4:57 PM

Share

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. కీలకమైన నటాంజ్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై మరోసారి వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో తీవ్ర నష్టం జరగినట్టు తెలుస్తోంది. ఇరాన్ న్యూక్లియర్‌ బాంబును ఎట్టి పరస్థితుల్లో కూడా అడ్డుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్‌ న్యూక్లియర్‌ సామర్ధ్యాన్ని ఇప్పటికే ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. అయితే శత్రువులను ఎలా ఓడించాలో తమకు తెలుసని ఇరాన్‌ హెచ్చరించింది.

పశ్చిమ ఆసియాలో యుద్దం 22వ రోజు కూడా అటు ఇరాన్‌, ఇటు ఇజ్రాయెల్‌పై భీకరదాడులు కొనసాగుతున్నాయి. శనివారం (మార్చి 21), అమెరికా – ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఇరాన్‌లోని అత్యంత కీలకమైన నతాంజ్ అణు కేంద్రంపై భారీ దాడి చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ భారీ బాంబు దాడి చేశాయని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘మిజాన్’ పేర్కొంది. అయితే, ఈ దాడిలో ఎలాంటి రేడియేషన్ లీకేజీలు జరగలేదని ఆ సంస్థ పేర్కొంది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అలజడిని సృష్టించింది.

యుద్ధం మొదటి వారంలో, అమెరికా – ఇజ్రాయెల్ ఇరాన్ ప్రధాన అణు కేంద్రమైన నతాంజ్‌పై దాడి చేశాయి. అక్కడ అనేక భవనాలు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపించాయి. ఈ అణు కర్మాగారం టెహ్రాన్ నుండి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. జూన్ 2025లో జరిగిన 12 రోజుల ఘర్షణలో కూడా ఇజ్రాయెల్ – అమెరికా దీనిని లక్ష్యంగా చేసుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాలు సంయుక్తంగా జరిపిన ఈ భారీ దాడి, కేవలం ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో సైనిక కార్యకలాపాలను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పిన సమయంలో జరిగింది. అదే సమయంలో అమెరికా పశ్చిమ ఆసియాలో మూడు అదనపు యుద్ధనౌకలను, సుమారు 2,500 మంది మెరైన్ సైనికులను మోహరిస్తోంది.

ఇదిలావుంటే, ఇరాన్‌లోని ఒక ప్రధాన గ్యాస్ క్షేత్రంపై తదుపరి దాడులు చేయబోమని ఒక రోజు ముందు ఇజ్రాయెల్ వాగ్దానం చేసినప్పటికీ, పర్షియన్ నూతన సంవత్సరం అయిన నౌరూజ్ వేడుకల మధ్య శుక్రవారం (మార్చి 20) నాడు ఇజ్రాయెల్ ఇరాన్‌పై వైమానిక దాడులు జరిపింది. మరోవైపు, గల్ఫ్ ప్రాంతంలోని చమురు, సహజ వాయువు కేంద్రాలపై ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. నగరంపై ఉన్న వాయు రక్షణ వ్యవస్థలు ఈ దాడులను అడ్డుకోవడంతో, శుక్రవారం తెల్లవారుజామున దుబాయ్‌లో ఒక శక్తివంతమైన పేలుడు శబ్దం వినిపించింది.

ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా చర్యలు ప్రారంభించింది. దీని తరువాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు, ప్రస్తుతానికి సముద్రతీర గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గురువారం రాత్రి తెలిపారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, వైమానిక దాడులలో పలువురు ఇరాన్ అగ్ర నాయకులు మరణించారు. ఆ దేశ సైనిక సామర్థ్యాలు బలహీనపడ్డాయని అమెరికా చెబుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us