దేవుని కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఉగాది నాడు ముస్లింలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. బీబీ నాంచారమ్మను ఆడపడుచుగా, వెంకటేశ్వరుడిని బావగారిగా భావించి సారె సమర్పిస్తారు. ఈ ఆనవాయితీ హిందూ-ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా కొనసాగుతోంది. ఈ ఆలయం తిరుమల తొలిగడపగా ప్రసిద్ధి చెందింది.