ఉత్తర్ ప్రదేశ్లో ఒక వింత ఘటనలో, తన భార్య తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందని అనుమానించిన రాజ్ కుమార్, ఆమెను తన ప్రియుడి దగ్గరికి పంపించేశాడు. భార్య ఫోన్లో "సిమెంట్ ఇంకా డ్రమ్" సంబంధిత హత్య కథనాలు, గతంలో జరిగిన మీరట్ ఘటనను చూసి రాజ్ కుమార్ భయాందోళనలకు గురయ్యాడు. కౌన్సిలింగ్లోనూ భార్య ప్రియుడితోనే ఉంటానని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.