AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్దం వేళ అమెరికాకు బిగ్ షాక్.. ఆయుధాల ఎగుమతులను నిలిపివేసిన ఐరోపా దేశం!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అగ్రరాజ్యానికి ఆయుధాల ఎగుమతులను స్విట్జర్లాండ్ నిషేధించింది. రాజకీయ సంఘర్షణలో తమ తటస్థ వైఖరిని తెలియజేస్తూ, పశ్చిమ ఆసియాలో యుద్ధం కొనసాగుతున్నంత కాలం ఆయుధాల ఎగుమతులను అనుమతించబోమని స్విట్జర్లాండ్ పేర్కొంది. ఈ చర్య అమెరికాకు ఆయుధ సరఫరాలపై ప్రభావం చూపవచ్చంటున్నారు రక్షణ రంగ నిపుణులు.

యుద్దం వేళ అమెరికాకు బిగ్ షాక్.. ఆయుధాల ఎగుమతులను నిలిపివేసిన ఐరోపా దేశం!
Weapons Exports To Us
Balaraju Goud
|

Updated on: Mar 20, 2026 | 7:13 PM

Share

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అగ్రరాజ్యానికి ఆయుధాల ఎగుమతులను స్విట్జర్లాండ్ నిషేధించింది. రాజకీయ సంఘర్షణలో తమ తటస్థ వైఖరిని తెలియజేస్తూ, పశ్చిమ ఆసియాలో యుద్ధం కొనసాగుతున్నంత కాలం ఆయుధాల ఎగుమతులను అనుమతించబోమని స్విట్జర్లాండ్ పేర్కొంది. ఈ చర్య అమెరికాకు ఆయుధ సరఫరాలపై ప్రభావం చూపవచ్చంటున్నారు రక్షణ రంగ నిపుణులు. గతంలో ఇరాక్ యుద్ధ సమయంలో కూడా స్విట్జర్లాండ్ తన తటస్థ వైఖరి కారణంగా అమెరికాకు ఆయుధాల ఎగుమతులను నిలిపివేసింది.

“యుద్ధ సమయంలో ఇరాన్‌తో యుద్ధంలో పాల్గొంటున్న దేశాలకు ఆయుధాల ఎగుమతి లైసెన్సులు జారీ చేయలేము. యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలను యునైటెడ్ స్టేట్స్‌కు ఎగుమతి చేయడం కూడా ప్రస్తుతం అనుమతించము,” అని స్విస్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2003లో అమెరికా నేతృత్వంలో ఇరాక్‌పై జరిగిన దాడి తరువాత, స్విట్జర్లాండ్ తన గగనతలంపై విమానాల రాకపోకలను, యుద్ధంలో పాల్గొంటున్న దేశాలకు ఆయుధాల ఎగుమతిని నిషేధించింది. ఆ తర్వాత ఈ ఆంక్షలను ఎత్తివేసింది.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడి తర్వాత అమెరికాకు ఆయుధాల ఎగుమతికి సంబంధించి ఎలాంటి కొత్త లైసెన్సులు జారీ చేయలేదని స్విస్ ప్రభుత్వం శుక్రవారం (మార్చి 20, 2026) తెలిపింది. రక్షణ రంగ నిపుణుల బృందం అమెరికాకు ఆయుధాల ఎగుమతులకు సంబంధించిన పరిణామాలను సమీక్షించి, తటస్థతా చట్టం కింద ఏమైనా చర్యలు అవసరమా అని అంచనా వేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us