మునగాకుతో ఆరోగ్యం.. కానీ వీరు తిన్నారంటే అది విషమే!
Samatha
21 march 2026
మునక్కాడలు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ మునక్కాడల గురించి తెలుసు. ఇక సాంబార్‌లో వీటిని వేసుకొని చాలా ఇష్టంగా తింటారు.
మున్నకాడలు
మునక్కాడలు మాత్రమే కాకుండా మున్నకాయ ఆకులతో కూడా చాలా రకాల వంటలు చేసుకుంటారు. ఇవి కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
ముఖ్యంగా మునగాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన చాలా మంది వీటిని తమ డైట్‌లో చేర్చుకుంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
పోషకాలు పుష్కలం
అయితే మునగాకు, మునక్కాడలు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఈ సమస్యలు ఉన్నవారు తినడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.
ఎవరు తినకూడదు
థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు మునగ తినడం అస్సలే మంచిది కాదు, ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
థైరాయిడ్
అలాగే, మునగాకులో అల్కలాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన లో బీపీ ఉన్నవారు వీటిని తినడం వలన సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.
లో బీపీ
అంతే కాకుండా జీర్ణసమస్యలు ఉన్నవారు కూడా మునగాకు తినడం మంచిది కాదంట. ఇది విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పికి కారణం అవుతుందంట.
జీర్ణ సమస్యలు
అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా దీనిని చాలా మితంగా తీసుకోవాలంట. ముఖ్యంగా వైద్యుడిని సంప్రదించిన తర్వాత దీనిని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.