ఒక చిట్టితల్లి చేసిన వైరల్ వీడియోకి స్పందించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ మాటను నిలబెట్టుకున్నారు. పెళ్లి తర్వాత చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా, తనను కూడా పిలవాలని కోరిన ఆ చిన్నారిని ఇంటికి ఆహ్వానించి, ఆమెకు ఇష్టమైన వంటకాలతోపాటు బోలెడన్ని స్వీట్లు వడ్డించారు. ఈ తీపి సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.