అదృష్టాన్నిచ్చే నెమలి ఈకలు.. ఇంట్లో ఏ దిశలో ఉంటే కలసి వస్తుందో తెలుసా?

Samatha

21 march 2026

చాలా మంది ఇంటిలో అలంకరణ కోసం నెమలి బొమ్మలు, లేదా పెయింటింగ్స్ పెట్టుకుంటారు. ఇక కొంత మంది నెమలి ఈకలను ఇంటిలో పెట్టుకుంటారు.

ఇంటి అలంకరణ

అయితే ఇలా ఇంటిలో నెమలి ఈకలను పెట్టుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఫలితాలు

శ్రీకృష్ణుడు తన తలపై ధరించే నెమలి ఈకలు చాలా పవిత్రమైనవి. అంతే కాకుండా వీటిని ఇంటిలో పెట్టుకోవడం వలన కష్టాలు తీరిపోయి, ఇంట్లో సానుకూలత పెరుగుతుందంట.

శ్రీకృష్ణుడు

అంతే కాకుండా వాస్తు దోషాలు తొలిగిపోవడమే కాకుండా ఇంటిలో ఆర్థిక సమస్యలు , అప్పుల బాధలు ఉండవంట. ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తాయంట.

వాస్తు దోషాలు

ముఖ్యంగా ఇంటిలో నెమలి ఈకలు ఉండటం వలన  ఇవి రాహుదోషాన్ని తొలిగిస్తాయంట. అయితే వీటిని తూర్పు లేదా వాయువ్య దిశలో పెట్టడం వలన రాహు దోషం తగ్గుతుంది.

రాహు దోషం

అదే విధంగా అప్పులు తీరిపోయి, ఇంట ఆర్థిక సమస్యలు ఉండకూడదు అంటే , నెమలి ఈకలను ఇంటిలో శుభప్రదమైన స్థలంలో మాత్రమే పెట్టాలంట. ఎందుకంటే లక్ష్మీదేవికి నెమలి ఈకలు చాలా ఇష్టం

లక్ష్మీదేవి అనుగ్రహం

అదే విధంగా, భార్య భర్తల మధ్య అనురాగం, ప్రేమ పెరగాలి అంటే, బంధం బలంగా ఉండాలి అంటే నెమలి ఈకలను ఇంటిలో తూర్పు దిశలో ఉంచాలి. దీని వలన అదృష్టం కలిసి వస్తుంది.

భార్య భర్తల బంధం

అదే విధంగా, ఆర్థికంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా కలిసి రావాలి అంటే నెమలి ఈకలను ఇంటిలో లివింగ్ రూమ్‌లో పెట్టడం చాలా శుభప్రదం

వ్యాపారం, ఆర్థికం