AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరాయి మోజు ప్రాణం తీసింది.. ప్రియుడి మాయలో పడి భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!

నంద్యాల జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మార్చి 12వ తేదీన కనిపించకుండా పోయిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పరాయి మోజు ప్రాణం తీసింది.. ప్రియుడి మాయలో పడి భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
Murder Mystery
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 5:42 PM

Share

నంద్యాల జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మార్చి 12వ తేదీన కనిపించకుండా పోయిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గడివేముల మండలం భోగేశ్వరం ఆలయం సమీపంలో శ్రీనివాసులు, వరలక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనివాసులు ఆలయంలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గడిగరేవుల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అదే ఆలయంలో టిక్కెట్ కౌంటర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు భార్య వరలక్ష్మీతో పరిచయం ఏర్పడింది. పరిచయం కొద్ది రోజులకే ప్రేమగా మారింది.

వెంకటేశ్వర్లు, వరలక్ష్మీల మద్య కొనసాగుతున్న ప్రేమాయణంపై శ్రీనివాసులు తరుచూ గొడవపడుతూ ఉండేవాడు. తాగి వచ్చి వరలక్ష్మిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి పదవ తేదీన పుల్ గా మద్యం తాగి వచ్చి వరలక్ష్మీతో మరోసారి ఘర్షణకు దిగాడు. వరలక్ష్మీ తోసి వేయగా శ్రీనివాసులు కిందపడి తలకు తీవ్రగాయం అయింది. కొన ఊపిరితో ఉన్న శ్రీనివాసులును ఎలాగైనా చంపాలని పథకం వేసింది వరలక్ష్మీ. వెంటనే ఫోన్ ద్వారా వెంకటేశ్వర్లు రమ్మని చెప్పింది. కొన ఊరితో ఉన్న శ్రీనివాసులను భార్య వరలక్ష్మీ, వెంకటేశ్వర్లు ఇద్దరు గొంతు నలిమి చంపేశారు. చనిపోయిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఆలయంలోని కళ్యాణమండపం వెనకాల యాసిడ్ పోసి అ తర్వాత షామియానాలు వేసి కాల్చి ఆనవాలు లేకుండా చేశారు.

రెండు రోజులైన తన కొడుకు కనిపించకపోవడంతో మృతుడు శ్రీనివాసులు తల్లి లక్ష్మీదేవి కంగారుపడింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో వెతికించింది. చివరికి మార్చి 12వ తేదీన గడివేముల పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు పోలీసులు అనుమానంతో వరలక్ష్మీ కాల్ డేటాను పరిశీలించారు. వరలక్ష్మీ తరుచూ వెంకటేశ్వర్లుతో మాట్లడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. వెంటనే వెంకటేశ్వర్లు, వరలక్ష్మీల కోసం పోలీసులు గాలించారు.

చివరికి ఇద్దరు ముద్దాయి గడవేముల తహశీల్దారు వెంకటరమణ‌ ముందు లొంగిపోయారు. లొంగిపోయి తాము ఇద్దరు కలిసి చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. తహశీల్దారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల చెప్పిన ఆధారాలతో హత్యకు గురైన శ్రీనివాసులును పూడ్చి పెట్టిన ప్రదేశంలో ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర్లు, వరలక్ష్మీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..