సిద్ధిపేట జిల్లా దుబ్బాకకు చెందిన అనీల్ కుమార్ తన కొత్త ఇంటికి బ్రహ్మానందం మీమ్ ఫోటోను దిష్టిబొమ్మగా పెట్టారు. "అప్పు చేసి కడుతున్నా బ్రో!" అనే క్యాప్షన్‌తో కూడిన ఈ మీమ్ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. పాతకాలపు దిష్టిబొమ్మలకు భిన్నంగా ఈ క్రియేటివ్ ఆలోచన ప్రజలను ఆకట్టుకుంది, ఇంటి యజమాని అనీల్‌కు ప్రశంసలు దక్కాయి.