పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ ఇటీవల హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించారు. అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ను గతంలో పవన్ కళ్యాణ్ పరామర్శించారు. నిరంజన్ మరణ వార్త విని సినీ నటుడు సోనూసూద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కెనడాలో ఉన్నప్పటికీ వీడియో కాల్ ద్వారా నిరంజన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.