AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: పాన్ కార్డు అసలైందా..? కాదా? పాన్‌లోని ఈ ఒక్క నెంబర్‌తో ఎవరైనా గుర్తు పట్టొచ్చు.. చాలామందికి తెలియని ట్రిక్..

ఆధార్ కార్డు తర్వాత అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఏదైనా ఉందంటే.. అదే పాన్ కార్డుగా చెప్పవచ్చు. గుర్తింపు ధృవీకరణకు మాత్రమే కాకుండా.. ఆర్ధిక లావాదేవీలను నిర్వహించడంలో ఈ కార్డు ఉపయోగపడుతుంది. దీంతో దేశంలోని నివసించే ప్రతీఒక్కరూ పాన్ కార్డు కలిగి ఉంటారు.

Pan Card: పాన్ కార్డు అసలైందా..? కాదా? పాన్‌లోని ఈ ఒక్క నెంబర్‌తో ఎవరైనా గుర్తు పట్టొచ్చు.. చాలామందికి తెలియని ట్రిక్..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Jul 09, 2026 | 3:52 PM

Share

ఉద్యోగంలో చేరాక జీతం పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు విత్ డ్రా చేయాలన్నా, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాన్నా పాన్ అనేది తప్పనిసరి. ఇక బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థల నుంచి ఏదైనా లోన్ పొందాలన్నా పాన్ అవసరమవుతుంది. దీంతో పాన్ కార్డు ఎప్పుడు యూజ్ అవుతుందనేది చెప్పడం కష్టం. దీంతో ఎప్పుడూ మనతోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ కార్డుతో పాటు ఫోన్‌లో ఫొటోకాపీ ఉంచుకోవడం వల్ల ఎప్పుడైనా అవసరమైనప్పుడు పని సులువవుతుంది.

పాన్ కార్డు 10 అంకెల అర్థం తెలుసా..?

పాన్ కార్డు విషయానికొస్తే.. 10 నెంబర్లు ఉంటాయి. మిమ్మల్ని గుర్తించడంలో ఈ నెంబర్లు కీలక పాత్ర పోషిస్తాయి. పాన్ కార్డు మీదా.. కాదా అనేది ఈ నెంబర్ల ద్వారా సులువుగా ఎవరైనా గుర్తించవచ్చు. ఆంగ్ల అక్షరాలు, నంబర్ల కలయికతో ఈ నెంబర్ ఉంటుంది. ఇవి కేవలం నెంబర్లు, అక్షరాలు అని మీరు అనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఈ నెంబర్ల వెనుక చాలా సీక్రెట్ ఉంది. కార్డుదారుడిని గుర్తు పట్టడంలో ఇది కీలక పాత్ర పోషిస్తాయి. కార్డు అసలైన వ్యక్తిదా.. కాదా అనేది తెలుసుకోవడంలో సహాయపడతాయి.

10 అక్షరాలకు మీనింగ్ ఏంటి..?

పాన్ కార్డులోని మొదటి మూడు అక్షరాలు AAA నుంచి ZZZ వరకు ఏవైనా ఉండవచ్చు. ఇది సిస్టమ్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. ఇక నాలుగో అక్షరం అనేది చాలా కీలకమైనది. నాలుగో అక్షరం మీ కార్డు ఏ కేటగిరీకి చెందినది అనేది సూచిస్తుంది. ఇండిపెండెంట్ కార్డా.. సంస్థకు లేదా ట్రస్ట్, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తుల సమూహం, లోకల్ అథారిటీగా సంబంధించిన కార్డా అనేది సూచిస్తుంది. నాలుగో అక్షరం పీ అని ఉంటే పర్సనల్ కార్డు అని అర్థం. అది ఒక వ్యక్తికి చెందినది అని మీనింగ్. ఇక సీ అంటే కంపెనీ లేదా ట్రస్టు, టీ అంటే ట్రస్ట్, ఎఫ్ అంటే భాగస్వామ్య సంస్థలు, ఎల్ అంటే లోకల్ అధారిటీ, హెచ్ అని ఉంటే హిందూ అవిభాజ్య కుటుంబాలు, ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, జీ అని ఉంటే ప్రభుత్వ సంస్థలు అని అర్థం.

కార్డు మీదా.. కాదా అనేది తెలుసుకోవడం ఎలా..?

ఇక కార్డులోని ఐదో అక్షరం అత్యంత కీలకం. ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని చూస్తుంది. ఉదాహరణకు మీ ఇంటి పేరు Nalla అయితే ఐదో అక్షరం N అని ఉంటుంది. ఒకవేళ ఈ ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని తొలి అక్షరం కాకపోతే కార్డు మీది కాదని అర్థం. కార్డుదారుడిని గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఇక ఆరు నుంచి తొమ్మిది అంకెలు 0001 నుంచి 9999 ఉంటాయి. వీటిని సిస్టమ్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. ఇక చివరి అక్షరాన్ని కూడా సిస్టమ్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది.

Follow Us