AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: జస్ట్ కొన్ని రోజులు వెయిట్.. ఈ రాశుల వారి అదృష్టం డబుల్, ఆదాయం పెరగడం ఖాయం!

Jupiter Combust Effects 2026: జూలై 14న గురు గ్రహం అస్తమించనుంది. ఈ జ్యోతిష్య పరిణామం వల్ల కర్కాటక, సింహ, వృశ్చిక రాశుల వారికి ఆర్థిక, కెరీర్, వ్యక్తిగత జీవితంలో అనుకూల ఫలితాలు కలిగే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Jul 09, 2026 | 2:31 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 14వ తేదీ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రోజున దేవగురువు బృహస్పతి (గురు గ్రహం) అస్తమించనున్నారు. గురు అస్తమయం ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, ముఖ్యంగా మూడు రాశుల వారికి శుభఫలితాలు, కొత్త అవకాశాలు, అనుకూల పరిణామాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులు ఏవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.

1 / 5
కర్కాటక రాశి: గురు అస్తమయం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశముంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తే మంచి లాభాలు పొందవచ్చు. అవసరమైన చోట మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిది. ఏదైనా పని ఆలస్యమైనా ఆందోళన చెందకుండా ఓపికగా ముందుకు సాగితే విజయాన్ని అందుకుంటారు. క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారి, మీరు ఆశించిన ఫలితాలు లభించే అవకాశముంది.

2 / 5
సింహ రాశి: సింహరాశి వారు ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. కార్యాలయంలో లేదా వ్యాపార సమావేశాల్లో అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా, సహనంతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు, ఫలితం లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

3 / 5
వృశ్చిక రాశి: గురు అస్తమయం వృశ్చిక రాశి వారికి కూడా సానుకూల ఫలితాలను అందించవచ్చు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సహనం పాటించడం మంచిది. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందకరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త కూడా వినే అవకాశముందని జ్యోతిష్య విశ్వాసం.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us