హైదరాబాద్‌లోని ఉప్పల్ చిలకనగర్‌లో భార్య హత్య కేసులో నిందితుడైన భర్త సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం అనుమానంతోనే భార్యను దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో సురేష్ అంగీకరించాడు. పరారీలో ఉన్న నిందితుడిని ముషీరాబాద్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.