ఏడాది పూర్తికాకుండా ఉద్యోగం మానేస్తే పీఎప్‌ డబ్బులు తీసుకోవచ్చా?

July 6, 2026

Subhash

1 సంవత్సరం సర్వీస్ పూర్తి కాకపోయినా పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి EPFO కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. అవేంటో తెలుసుకుందాం..

ఈపీఎఫ్‌ కొత్త నియమాలు

EPFO కొత్త నిబంధనల ప్రకారం.. పీఎఫ్ విత్‌డ్రా అనేది మీరు ఎంతకాలం ఉద్యోగం చేశారు అనేదానిపై కాకుండా, ఉద్యోగం మానేశాక ఎంతకాలం 'నిరుద్యోగి'గా ఉన్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

అసలు నియమం ఏమిటి?

మీరు ఒక కంపెనీలో ఉద్యోగం మానేసి, 1 నెల రోజులు గడిచినా కొత్త ఉద్యోగం లభించకపోతే మీ పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

1 నెల నిరుద్యోగ కాలం

ఉద్యోగం మానేసిన తర్వాత రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిరుద్యోగిగా ఉంటే, మీరు మీ పీఎఫ్ ఖాతాలోని 100% (మొత్తం) డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి అర్హులు.

2 నెలల నిరుద్యోగ కాలం

ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్ పూర్తిగా ఖాళీ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో మొదటి దశలో 75% మాత్రమే విత్‌డ్రా ఇచ్చి, మిగిలిన 25% మొత్తాన్ని తర్వాత విత్‌డ్రా చేసుకునేలా EPFO కొత్త అప్‌డేట్ తెచ్చింది.

భద్రత

EPFO ప్రక్రియను మరింత డిజిటలైజ్ చేసింది. ఇప్పుడు పీఎఫ్ క్లెయిమ్‌లను కేవలం 3 రోజుల్లోనే సెటిల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల అత్యవసర సమయంలో డబ్బు త్వరగా అందుతుంది.

3 రోజుల్లోనే క్లెయిమ్

5 సంవత్సరాల సర్వీస్ కంటే ముందే పీఎఫ్ విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ (TDS) పడే అవకాశం ఉంది. అలాగే  రిటైర్మెంట్ ఫండ్ తగ్గిపోతుంది. కాంపౌండింగ్ వడ్డీ లాభాన్ని కోల్పోతారు.

PF ముందే తీస్తే నష్టాలు ఇవే

పీఎఫ్ అనేది ఒక ఎమర్జెన్సీ ఫండ్. కేవలం కంపెనీలు మారుతున్నట్లయితే, డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కంటే పాత పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీ ఖాతాకు 'ట్రాన్స్‌ఫర్' చేసుకోవడమే అత్యుత్తమ మార్గం.

విత్‌డ్రా