AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.2 వేలు.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం కొత్త పథకం..

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు నెలవారీ పెన్షన్ సదుపాయం కల్పిస్తోంది. 58 ఏళ్ల తర్వాత ప్రతీ నెలా పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పెన్షన్ పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు పాటించకపోతే పెన్షన్ కోల్పోయే ప్రమాదముంది. అసలు ఈ పెన్షన్ ఎలా లెక్కిస్తారంటే..?

EPFO: ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.2 వేలు.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం కొత్త పథకం..
Epfo
Venkatrao Lella
|

Updated on: Jul 09, 2026 | 2:18 PM

Share

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? అయితే కేంద్ర ప్రభుత్వం మీకు అనేక ప్రయోజనాలు అందిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీ అందిస్తుండగా.. ప్రస్తుతం గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ చేస్తోంది. ఈ నెల 15వ తేదీలోగా అర్హులైన ఖాతాదారులందరికీ వడ్డీని అకౌంట్లలో వేయనుంది. ఇప్పటికే పలువురు ఖాతాల్లో వడ్డీ జమ అయింది. ఇక వార్షిక వడ్డీతో పాటు పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం రూ.7 లక్షల లైఫ్ ఇన్యూరెన్స్ కూడా అందిస్తోంది. దీనికి ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నప్పుడు మీరు మరణిస్తే నామినీకి రూ.7 లక్షలు అందిస్తారు. ఇక దీంతో పాటు పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ సౌకర్యం కూడా కేంద్రం అందిస్తోంది. 58 ఏళ్ల తర్వాత ప్రతీ నెలా మీ అకౌంట్లో ఈ పెన్షన్ జమ చేశారు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. పెన్షన్ అందుకోవాలంటే అర్హతలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జూన్ 29న ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్) 2026ను నోటిఫై చేసింది. ఈపీఎస్-1995,1971 స్థానంలో దీనిని తీసుకొచ్చింది. నెలవారీ పింఛన్ లెక్కింపు, కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పీరియడ్ నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. నెలవారీ పెన్షన్ పొందాలంటే 10 సంవత్సరాల సర్వీస్ తప్పనిసరి. అప్పుడే 58 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పింఛన్ పొందవచ్చు. అయితే 50 ఏళ్లు నిండిన తర్వాత కూడా ముందస్తు పింఛన్ పొందవచ్చు. కానీ పెన్షన్ తక్కువగా అందుతుంది. అయితే 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేయనివారు నెలవారీ పింఛను పొందేందుకు అర్హులు కారు. అటువంటి సందర్భంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మీరు ఈపీఎస్ నిధులను ఉపసంహరించుకోవచ్చు. రెండ ఆప్షన్ వచ్చి మీ సర్వీసు కాలాన్ని భవిష్యత్ ఉద్యోగంతో విలీనం చేసుకునేందుకు ‘స్కీమ్ సర్టిఫికేట్’ పొందవచ్చు.

పీఎఫ్ పెన్షన్‌ ఎలా లెక్కిస్తారంటే..?

నెలవారీ పింఛను = (పింఛను అర్హత గల జీతం × పింఛను అర్హత గల సర్వీసు) ÷ 70 రూల్ ప్రకారం పెన్షన్ లెక్కిస్తారు. ‘పెన్షన్‌కు అర్హత గల జీతం’ అంటే మీ చివరి 60 నెలల సర్వీసులోని మీ బేసిక్ శాలరీ, DA సగటు.

రూ.15 వేల జీతంపై ఎంత పెన్షన్ లభిస్తుంది..?

ఉదాహరణకు మీ పెన్షన్ అర్హత జీతం రూ.15 వేలకు అనుకుంటే 10 ఏళ్ల సర్వీస్ పూర్తయితే 58 ఏళ్ల తర్వాత నెలకు రూ.2,143 పెన్షన్‌ అందుతుంది. ఇక 20 ఏళ్ల సర్వీస్ పూర్తయితే రూ.4,286 లభిస్తుంది. ఇక 35 సంవత్సరాల సర్వీస్ చేస్తే నెలకు రూ.7,500 పింఛను పొందవచ్చు. సర్వీసు కాలం ఎంత ఎక్కువగా ఉంటే పింఛను అంత ఎక్కువగా ఉంటుంది. మీకు జీవితాంతం ఈ పెన్షన్ లభిస్తుంది. మీరు చనిపోతే నామినీకి అందిస్తారు.

Follow Us