AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ పడుతుందా..? ఎంత కట్ అవుతుంది..? ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టమే..

పీఎఫ్ అకౌంట్లోని నగదును తమ అవసరాల కోసం విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా విత్ డ్రా చేసుకునే సమయంలో ట్యాక్స్ పడుతుందా.. లేదా అనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు. ట్యాక్స్ పడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది తప్పు.

EPFO: పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ పడుతుందా..? ఎంత కట్ అవుతుంది..? ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టమే..
Epfo
Venkatrao Lella
|

Updated on: Aug 23, 2026 | 4:16 PM

Share

చాలామంది తమ ఆర్ధిక అవసరాల కోసం పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ముందస్తు ఉపసంహరణ ఆప్షన్ ద్వారా నిధులు తీసేసుకుంటారు. పీఎఫ్ బ్యాలెన్స్‌లోని 75 శాతం నిధులను ఉద్యోగంలో ఉన్నప్పుడే తీసుకోవచ్చు. మిగతా 25 శాతం నగదు ఉద్యోగం మానేసిన ఏడాది తర్వాత ఫైనల్ సెటిల్‌మెంట్ కేటగిరీ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ఏడాదిలోపు ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్న వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరితే తీసుకోవడం కుదరదు. అయితే పీఎఫ్ ఖాతాలోని డబ్బులను విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ పడుతుందా..? ఎంతవరకు ట్యాక్స్ పడుతుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ట్యాక్స్ ఎప్పుడు పడుతుందంటే..?

పీఎఫ్ డబ్బులపై ట్యాక్స్ పడదని చాలామంది అనుకుంటుంటారు. పూర్తిగా సురక్షితమని అందరూ భావిస్తారు. కానీ ఇది తప్పు. పీఎఫ్ డబ్బులపై కూడా పన్ను ఉంటుంది. మీ సర్వీస్ కాలం, ఎప్పుడు విత్ డ్రా చేసుకుంటున్నారనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఐదేళ్ల పాటు నిరంతరం సర్వీసులో ఉండకుండా ముందే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకుంటే ట్యాక్స్ పడుతుంది. మీరు వేర్వేరు కంపెనీల్లో పనిచేసినప్పుడు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మీ బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే సర్వీస్‌గానే లెక్కిస్తారు. సర్వీస్ కాలం ఐదేళ్లు పూర్తి కాకముందే విత్ డ్రా చేసుకుంటే మీరు ఉపసంహరించుకున్న సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా ఇన్‌కమ్ ట్యాక్స్ పరిగణిస్తుంది. అలాగే టీడీఎస్ కూడా ఈ సమయంలో వర్తిస్తుంది. ఐదేళ్లు పూర్తి చేయకముందే ఉపసంహరించుకుంటే 10 శాతం పన్ను ఉంటుంది. పాన్ వివరాలు అందించకపోతే 30 శాతం వరకు ట్యాక్స్ కట్ అవుతుంది. దీంతో మీ పాన్ కార్డును యూఏఎన్ పోర్టల్‌లో అప్డేట్ చేసుకోవడం మంచిది.

ఐదేళ్లు పూర్తయితే..

ఇక ఐదేళ్ల సర్వీస్ కాలం పూర్తైతే ఎలాంటి పన్ను ఉండదు. ఇలాంటప్పుడు ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. ఐదేళ్ల లోపు విత్ డ్రా చేయడం వల్ల సెక్షన్ 80సీ కింద వచ్చే పన్ను ప్రయోజనాలు రద్దవుతాయి. ఒక ఆర్ధిక సంవత్సరంలో ఉద్యోగి వాటా రూ.2.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే అదనపు మొత్తంలో వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. ఒకవేళ అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్ సమర్పించడం వల్ల టీడీఎస్ కట్ అవ్వదు. ఎక్కువ జీతాలు పొందేవారు ఈ పని చేయాలి. తక్కువ జీతం పొందేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతో ఎక్కువ జీతం పొందేవారు, పెద్ద మొత్తంలో పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకునేవారు ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

Follow Us