మళ్లీ భయపెట్టిస్తున్న బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

September 4, 2026

Subhash

మళ్లీ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇటీవల  తగ్గిన బంగారం ఒక్కసారిగా అందనంత ఎత్తుకు వెళుతోంది.

 బంగారం ధరలకు రెక్కలు

పసిడి ధరలు అనూహ్యంగా మళ్లీ పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుస రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

పసిడి ధరలు

 కేవలం గడిచిన రెండు రోజుల్లోనే 10 గ్రాముల పసిడిపై 4,640 రూపాయల వరకు ధర పెరిగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

గడిచిన రెండు రోజుల్లోనే

రికార్డు స్థాయిలో పెరుగుతూ వినియోగదారులను ఆందోళన కలిగిస్తోంది. నిన్న రూ. 3 వేలు పెరిగిన బంగారం.. తాజాగా రూ.1310 వరకు పెరిగింది.

రికార్డు స్థాయిలో

ధరలు  పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,660 రూపాయల వద్ద ట్రేడవుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,600 రూపాయల వద్ద ఉంది.

ధరలు  పెరిగిన తర్వాత

ఇక వెండి ధర విషయానికొస్తే.. దీని ధర పెద్దగా ప్రభావడం చూపడం లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర 2 లక్షల 50 వేల రూపాయల వద్ద ట్రేడవుతోంది.

వెండి ధర

ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ భారీగా పెరగడం, దానికి అనుగుణంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. 

బంగారం ధరలు ఎందుకు పెరిగాయి?

అయితే ఇప్పుడు మళ్లీ యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్‌పై రాబడి తగ్గడంతో పరిస్థితి మారిపోయింది. బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. 

యూఎస్ ట్రెజరీ బాండ్