పర్సనల్ లోన్ కావాలా..? బ్యాంక్ రూల్స్ ఇవిగో.

Venkatrao Lella

Images: Pinterest

10 Sep 2026

వ్యక్తిగత అవసరాల కోసం అత్యవసరంగా డబ్బులు అవసరమైతే అందరికీ గుర్తొచ్చే పేరు పర్సనల్ లోన్. ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టకుండా ఈ రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్లు కూడా మంజూరు చేస్తున్నాయి

పర్సనల్ లోన్ తీసుకోవాలంటే చాలా అర్హతలను బ్యాంకులు పరిశీలిస్తాయి. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఉందా..? లేదా? తిరిగి కట్టకలిగే సామర్థ్యం ఉందా? అనే విషయాలతో పాటు సిబిల్ స్కోర్ కూడా తనిఖీ చేస్తాయి.

అలాగే క్రెడిట్ హిస్టరీని కూడా బ్యాంకులు క్షుణంగా పరిశీలిస్తాయి. గతంలో తీసుకున్న లోన్లను సకాలంలో చెల్లించారా.. లేదా అనేది చూస్తారు. పర్సనల్ లోన్ విషయంలో సిబిల్ స్కోర్ అనేది కీలక పాత్ర పోషిస్తోంది.

పర్సనల్ లోన్‌కు ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టరు గనుక బ్యాంకులు మీ ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, సిబిల్ స్కోర్ చెక్ చేస్తాయి. ఈ మూడు అర్హతలు సరిగ్గా ఉంటే లోన్ వెంటనే మంజూరు చేస్తాయి. లేకపోతే ఆలస్యం కావొచ్చు

ఉద్యోగ స్టేటస్, వయస్సు పరిమితి, తక్కువ ఆదాయ-రుణ నిష్పతి అంశాలను బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి. ఇప్పటికే మీరు చెల్లిస్తు్న్న లోన్ ఈఎంఐల  ఆధారంగా రుణ-ఆదాయ నిష్పత్తిని లెక్కిస్తారు.

మీ జీతం రూ.లక్షగా ఉండి ఈఎంఐల కోసం రూ.30 వేలు చెల్లిస్తుంటే.. 30 శాతం డీటీఐగా బ్యాంకులు పరిగణిస్తాయి. 35 శాతం కంటే తక్కువ డీటీఐ ఉంటే బ్యాంకులు సానుకూలంగా స్పందిస్తాయి. కొన్ని బ్యాంకులు 45 శాతం వరకు కూడా ఆమోదిస్తాయి.

పర్సనల్ లోన్ పొందేందుకు కనీస జీతం రూ.15 వేలు ఉండాలి. కొన్ని బ్యాంకులు రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటేనే మంజూరు చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో పనిచేసేవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఉద్యోగం కోల్పోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తాయి

ఆదాయం తక్కువగా ఉన్నవారు కూడా రుణం పొందవచ్చు. కానీ సహ దరఖాస్తుదారుడు లేదా హామీదారుడి వివరాలను అందించాల్సి ఉంటుంది. ఇక మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే వెంటనే లోన్ అందిస్తాయి