కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో టమాటా రెండు రూపాయలకే అమ్ముడవుతుండటంతో రైతులు కనీసం రవాణా ఖర్చులు కూడా రాక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.