ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలు ఇవే.. టాప్‌లో..

Venkatrao Lella

Images: Pinterest

03 Sep 2026

మడగాస్కర్ ప్రపంచంలో అత్యంత పేద దేశం. 18.1 బిలియన్ డాలర్ల జీడీపీ, 30.3 మిలియన్ల జనాభా ఉంది. దీని ఆర్థిక వ్యవస్థ పర్యాటకం, గనుల తవ్వకంపై ఆధారపడి ఉంది.

ఇరాన్‌కు సన్నిహిత మిత్రదేశమైన యెమెన్ కూడా అత్యంత పేద దేశాల జాబితాలో ఉంది. దీని జీడీపీ 16.22 బిలియన్ డాలర్లు కాగా.. జనాభా 34.4 మిలియన్లుగా చెప్పవచ్చు

పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియా జనాభా 5,492,486 ఉంటుంది. ఇది కూడా ప్రపంచంలో అత్యంత పేద దేశంగా ఉంది. మొత్తం GDP కేవలం $5.05 బిలియన్లుగా ఉంది

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో: 79.24 బిలియన్ డాలర్ల GDP కలిగి ఉంది. ఇక 104,354,615 జనాభా ఉంది. కోబాల్ట్, రాగి వనరులుపై దేశం ఆధారపడి ఉంది.

సముద్రపు దొంగతనాలకు కుప్రసిద్ధి చెందిన సోమాలియా ప్రపంచంలో అత్యంత పేద దేశాల జాబితాలో ఉంది. దీని GDP $13.89 బిలియన్లు. జనాభా 19,009,151.

మొజాంబిక్: ఈ తూర్పు ఆఫ్రికా దేశం సహజ వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ.. పేద దేశంగానే కొనసాగుతోంది. దీని GDP $24.55 బిలియన్లు కాగా.. జనాభా 34,497,736

మలావి: ఇది ఆగ్నేయ ఆఫ్రికా దేశం.. దీని GDP $10.78 బిలియన్లు. జనాభా 21,390,465

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్: 3.03 బిలియన్ డాలర్ల GDP కాగా.. 5,849,358 జనాభా కలిగి ఉంది

బురుండి: ఇది తూర్పు ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం. దీని GDP $2.15 బిలియన్లు కాగా.. జనాభా 13,459,236.

దక్షిణ సూడాన్:  ప్రపంచంలో అత్యల్ప తలసరి GDPని కలిగి ఉంది. GDP $29.99 బిలియన్లు కాగా.. జనాభా 11 మిలియన్లు.