AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీటీడీ సంచలన నిర్ణయం.. భక్తులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం!

టీటీడీ సంచలన నిర్ణయం.. భక్తులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం!

Phani CH
|

Updated on: Sep 11, 2026 | 7:09 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ఊరటనిచ్చింది. ప్రమాదవశాత్తు మరణించే భక్తుల కుటుంబాలకు అందించే బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. సహజ మరణం సంభవించినా కుటుంబానికి రూ.2 లక్షలు అందించనుంది. ఎల్ఐసీ సహకారంతో ఈ ప్రత్యేక గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయనుంది. లడ్డూ తయారీకి అదనపు సిబ్బంది, అన్నప్రసాదం వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ వంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి భారీ ఊరటనిస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దాదాపు 50 అజెండా అంశాలపై చర్చించి, పలు చారిత్రాత్మక తీర్మానాలు చేశారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ఎల్ఐసీ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా భక్తులకు ప్రత్యేక గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. దీని ప్రకారం, తిరుమలలో ప్రమాదశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు అందించే బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచారు. అంతేకాకుండా, దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుమలలో సహజ మరణం సంభవించినా అలాంటి భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలు కోసం ఎల్ఐసీ సంస్థకు టీటీడీ నిధుల నుంచి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. అలాగే భక్తులతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. CPS, NPS పెన్షనర్లకు EHF సౌకర్యం కల్పిస్తూ రూ.2 కోట్ల యాజమాన్య వాటాకు అంగీకరించారు. శ్రీవారి పోటులో లడ్డూల తయారీని వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్‌సోర్సింగ్ కార్మికుల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం వ్యర్థాలతో బయో గ్యాస్ తయారు చేసేందుకు రూ.2.80 కోట్లతో ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు నారాయణవనం, చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాల్లో పద్మపీఠం, ధ్వజస్తంభం, బలిపీఠాలకు బంగారు తాపడం చేసేందుకు భారీగా నిధులు కేటాయించారు. దాతల సౌకర్యార్థం నామినీల మార్పులో వెసులుబాటు కల్పించడంతో పాటు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు రెండో విడత ఆర్థిక సహాయం కింద రూ.7.56 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. భక్తులకు మరింత మెరుగైన వసతులు, భద్రత కల్పించడమే లక్ష్యంగా టీటీడీ ఈ సమావేశంలో చారిత్రాత్మక ముందడుగు వేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!

దుబాయ్‌లో సింగిల్‌ రూమ్‌ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

Follow Us