AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!

అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!

Phani CH
|

Updated on: Sep 10, 2026 | 4:49 PM

Share

ప్రభుత్వ బస్సు ప్రయాణానికి కొత్త అనుభూతిని అందిస్తూ కేరళ ఆర్టీసీ ప్రీమియం లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించింది. తిరువనంతపురం-కొచ్చి మధ్య నడిచే ఈ బస్సుల్లో లెదర్‌ సీట్లు, వ్యక్తిగత ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్లు, ఉచిత హైస్పీడ్‌ వైఫై, ఛార్జింగ్‌ పోర్టులు ఉన్నాయి. ప్రయాణికులకు స్నాక్స్‌, వేడి పానీయాలు అందించేందుకు హోస్టెస్‌ కూడా ఉంటారు. అంతేకాదు బస్సులోనే వాష్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా ప్రభుత్వ బస్సు ప్రయాణం అంటే విపరీతమైన రద్దీతో ఒకరకమైన అసౌకర్యమైన అనుభవం ఉంటుంది. కానీ, ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తూ కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అచ్చం విమానంలో లభించే అత్యాధునిక సౌకర్యాలను తలపించేలా ఓ ప్రీమియం లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ లేడీ వ్లాగర్ ఈ బస్సులోని సౌకర్యాలను వివరిస్తూ తీసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేరళలోని రెండు ప్రముఖ నగరాలైన తిరువనంతపురం, కొచ్చి మధ్య ఈ ప్రత్యేక లగ్జరీ బస్సులను నడుపుతున్నారు. “ఇకపై బిజినెస్ క్లాస్ సౌకర్యాలు కేవలం అంతర్జాతీయ విమానాల్లోనే కాదు, కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లోనూ అందుబాటులో ఉన్నాయి” అంటూ ఆమె తన వీడియోలో పేర్కొన్నారు. ఈ బస్సులో అడుగుపెట్టగానే కనిపించే విలాసవంతమైన లెదర్ సీట్లు, ప్రతి సీటుకూ ప్రత్యేకంగా అమర్చిన ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ప్రయాణంలో ఎలాంటి బోర్ కొట్టకుండా హై-స్పీడ్ ఉచిత వైఫై, మొబైల్ ఛార్జింగ్ పోర్టులను ఏర్పాటు చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా, విమానాల్లో మాదిరిగానే ప్రయాణికులకు సేవలందించడానికి ప్రత్యేకంగా ఒక హోస్టెస్ అందుబాటులో ఉండటం విశేషం. ఆమె ప్రయాణంలో వేడి వేడి పానీయాలు, షవర్మా రోల్స్ వంటి స్నాక్స్ అందిస్తూ ప్రయాణికులకు రాజభోగం రుచి చూపిస్తున్నారు. సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులు పడే ప్రధాన నరకయాతన టాయిలెట్ సమస్య. దీనికి చెక్ పెడుతూ బస్సులోనే అత్యంత శుభ్రమైన వాష్‌రూమ్‌ను కూడా నిర్మించారు. ఈ అద్భుతమైన సౌకర్యాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇండియన్ రైల్వేస్ అధికారి అనంత్ రూపనగుడి కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ కేరళ ఆర్టీసీని ప్రశంసించారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లిన ఈ కేరళ ఆర్టీసీ ప్రీమియం సర్వీస్, దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దుబాయ్‌లో సింగిల్‌ రూమ్‌ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

లోను తీసుకున్న వ్యక్తి కట్టలేకపోతే.. అది ఎవరు చెల్లించాలి.. బ్యాంకు రూల్స్‌ ఇవే!

Follow Us