AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోను తీసుకున్న వ్యక్తి కట్టలేకపోతే.. అది ఎవరు చెల్లించాలి.. బ్యాంకు రూల్స్‌ ఇవే!

లోను తీసుకున్న వ్యక్తి కట్టలేకపోతే.. అది ఎవరు చెల్లించాలి.. బ్యాంకు రూల్స్‌ ఇవే!

Phani CH
|

Updated on: Sep 10, 2026 | 1:05 PM

Share

బ్యాంకు లోన్‌కు గ్యారెంటర్‌గా సంతకం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. రుణగ్రహీత సకాలంలో చెల్లింపులు చేయకపోతే, నిబంధనల ప్రకారం బ్యాంకు హామీదారుడి నుంచి కూడా బకాయిలను వసూలు చేసే అవకాశం ఉంటుంది. అసలు, వడ్డీ, ఇతర బకాయిలతో పాటు క్రెడిట్‌ స్కోర్‌పై కూడా ప్రభావం పడొచ్చు. భవిష్యత్తులో సొంతంగా లోన్‌ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే రుణగ్రహీత ఆర్థిక పరిస్థితి, లోన్‌ నిబంధనలు ముందే పరిశీలించాలి.

ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల్లో రుణం తీసుకునేటప్పుడు చాలా మందికి హామీదారుల (గ్యారెంటర్) అవసరం పడుతుంది. అయితే ఎవరికైనా హామీ సంతకం పెట్టడానికి చాలామంది జంకుతుంటారు. రుణం తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లించకపోతే ఆ భారం తమపై పడుతుందనే భయమే ఇందుకు ప్రధాన కారణం. మరి నిజంగానే హామీదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. రుణగ్రహీత సకాలంలో లోన్ తిరిగి చెల్లించని పక్షంలో ఆ బాధ్యత పూర్తిగా హామీదారుడిపై పడుతుంది. కేవలం సంతకం పెట్టడంతో సరిపోతుంది అనుకుంటే పొరబడినట్టే. భారతీయ కాంట్రాక్టు చట్టంలోని సెక్షన్ 128 ప్రకారం.. బ్యాంకులు రుణగ్రహీతతో పాటు హామీదారుని నుంచి కూడా డబ్బులు వసూలు చేసే హక్కు కలిగి ఉంటాయి. అసలుతో పాటు వడ్డీ, ఇతర జరిమానాలు కూడా హామీదారుడే చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల హామీదారుడి క్రెడిట్ (సిబిల్) స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది. భవిష్యత్తులో సొంతంగా హోమ్ లోన్, కార్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంకులు రుణం తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా హామీగా ఉండే ముందు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. రుణగ్రహీత ఆర్థిక పరిస్థితి, క్రెడిట్ హిస్టరీ, గతంలో వారు లోన్లు సక్రమంగా చెల్లించారా లేదా అనే విషయాలను ముందే పరిశీలించాలి. లోన్ మొత్తం, వడ్డీ రేటు, ఈఎంఐ వివరాలను పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం. ఆ హామీ పరిమిత బాధ్యత కోసమా లేక పూర్తి బాధ్యత కోసమా అనేది చెక్ చేసుకోవాలి. పత్రాలను క్షుణ్ణంగా చదవకుండా ఎవరికీ గుడ్డిగా హామీ సంతకాలు పెట్టకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి సకాలంలో చెల్లించలేడని అనుమానం ఉంటే, అలాంటి రుణాలకు హామీగా ఉండకపోవడమే అత్యంత సురక్షితమైన మార్గం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: అప్పుడే 320 కోట్ల బిజినెస్‌ ఇదెక్కడి అరాచకం సామి.. | NTR క్రేజ్‌కు ఇదొక ఋజువనే చెప్పాలి

New Row On Irumudi: లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా ?? ఇరుముడి సినిమాపై కొత్త వివాదం

హృదయవిదారక ఘటన.. చనిపోయిన అమ్మానాన్నలు మళ్లీ వస్తారని ఆ చిన్నారి ఎదురుచూపు

వినాయక చవితి వస్తున్నా వాన లేదు. మబ్బులే తప్ప చినుకు కరువు.. వర్షాలు లేక రైతుల్లో ఆందోళన

ఇంటర్ పాసైతే.. రూ.92,000 జీతం! SSC నుంచి బిగ్ నోటిఫికేషన్!!

Follow Us