AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Row On Irumudi: లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా ?? ఇరుముడి సినిమాపై కొత్త వివాదం

New Row On Irumudi: లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా ?? ఇరుముడి సినిమాపై కొత్త వివాదం

Phani CH
|

Updated on: Sep 09, 2026 | 5:09 PM

Share

బాక్సాఫీస్‌ దగ్గర దూసుకెళ్తున్న ‘ఇరుముడి’ సినిమాపై కొత్త వివాదం మొదలైంది. సినిమాలో అయ్యప్ప దీక్ష, మద్యం సేవించే భక్తులకు సంబంధించిన సన్నివేశాలను చూపించడంపై అఖిల భారత అయ్యప్ప దీక్ష సమితి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలపై మూవీ యూనిట్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల చిత్రీకరణపైనా విమర్శలు వచ్చాయి.

ఓ పక్క బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్స్‌ కుమ్మేస్తోంది ఇరుముడి సినిమా! ట్రాక్టర్లు , ట్రాలీ ఆటోళ్లేసుకుని మరీ ఈ సినిమాకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. సినిమాలోని ఎమోషన్ అలా మరీ.! కానీ మరో పక్క మాత్రం.. ఇరుముడి సినిమా ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది. అఖిల భారత అయ్యప్ప దీక్ష సమితి సభ్యులు.. ఈ సినిమాపై ఓ అభ్యంతంర వ్యక్తం చేస్తున్నారిప్పుడు. లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా.? దీక్ష ముగిసిన వెంటనే మళ్లీ తారుగురా…? మూవీలో ఇదే చూపించారని.. ఇలా చూపించడం సరికాదని అఖిల భారత అయ్యప్ప దీక్ష సమితి సభ్యులు మండిపడుతున్నారు. అంతేకాదు అయ్యప్పస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన అంశాలపై మూవీ యూనిట్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మీకు తెలిసిందే.. ఇంతకు ముందు గవర్నమెంటు టీచర్లు ఇరుముడి సినిమాపై విమర్శలు చేశారు. గవర్నమెంట్ టీచర్లను చెడుగా చూపిన సన్నివేశాలను సినిమా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. ఇక ఇప్పుడేమో .. అయ్యప్ప దీక్ష సమితి సభ్యులు.. ఈ సినిమాపై కొత్త అభ్యంతరం లేవనెత్తారు. మరి వీటిపై మీరేమంటారు? కింద కామెంట్ చేయండి..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హృదయవిదారక ఘటన.. చనిపోయిన అమ్మానాన్నలు మళ్లీ వస్తారని ఆ చిన్నారి ఎదురుచూపు

వినాయక చవితి వస్తున్నా వాన లేదు. మబ్బులే తప్ప చినుకు కరువు.. వర్షాలు లేక రైతుల్లో ఆందోళన

ఇంటర్ పాసైతే.. రూ.92,000 జీతం! SSC నుంచి బిగ్ నోటిఫికేషన్!!

క్లాస్‌ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్‌ అంతలోనే ఊహించని సంఘటన

Snake in Bike: బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు

Follow Us