AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppal Balu: రీల్స్, ఈవెంట్స్ కాకుండా ఉప్పల్ బాలు ఆ పని కూడా చేస్తున్నాడా? నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 మొదలైనప్పటి నుంచి ఉప్పల్ బాలు పేరు తెగ వినిపిస్తోంది. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసినా ఇతని ఫొటోలు, వీడియోలే దర్శన మిస్తున్నాయి. మరి అసలు ఈ ఉప్పల్ బాలు ఏం చేస్తాడు? అతని నెల సంపాదన ఎంతో తెలుసుకుందాం రండి.

Uppal Balu: రీల్స్, ఈవెంట్స్ కాకుండా ఉప్పల్ బాలు ఆ పని కూడా చేస్తున్నాడా? నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Uppal Balu
Basha Shek
|

Updated on: Aug 23, 2026 | 7:55 PM

Share

ఉప్పల్ బాలు.. సోషల్ మీడియాను అనుసరించే ప్రతీ ఒక్కరికీ ఈ పేరు తెలిసే ఉంటుంది. టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఇతన కూడా ఒకరు. తన కామెడీ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలు. తనదైన స్టైల్ లో రీల్స్, వీడియోలు చేస్తూ ఎంతో మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ఉప్పల్ బాలు క్రేజ్ ఎలాంటిదంటే.. సెలబ్రెటీలు కూడా కొంతమంది ఉప్పల్ బాలును ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఇక పలు టీవీ షోల్లోనూ, అలాగే ఒకటి రెండు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు ఉప్పల్ బాలు. ఇక గత కొన్ని రోజులుగా ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగుతుంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా బాలు బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ లో పాల్గొనడం, అక్కడ జడ్జీలు అతనిని ఘోరంగా అవమానించడం తెలిసిందే. దీంతో కోపోద్రిక్తుడైన ఉప్పల్ బాలు అగ్ని పరీక్ష జడ్జీలు ముఖ్యంగా నవదీప్ ను బాగా తిడుతూ రోజుకో వీడియోను విడుదల చేస్తున్నాడు. ఈ విషయంలో నెటిజన్లు అలాగే కొందరు బుల్లితెర ప్రముఖులు కూడా ఉప్పల్ బాలుకే సపోర్టుగా నిలబడడం గమనార్హం. మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియా అంతలా ఉప్పల్ బాలుదే హవా.

ఇదంతా పక్కన పెడితే అసలు ఉప్పల్ బాలు అసలు ఏమి చేస్తున్నాడు? అతని నెల సంపాదన ఎంత? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలు ఇదే విషయంపై మాట్లాడాడు. తాను గత కొంతకాలంగా హియా బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నానని , అందుకు గాను వాళ్లు నెలకు 80 వేల నుంచి లక్ష రూపాయిల వరకు డబ్బులు ఇస్తున్నారని బాలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుం తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాని , జీవితం ఇప్పుడు చాలా బాగుంది అంటూ హర్షం వ్యక్తం చేశాడు బాలు.

ఇవి కూడా చదవండి

ఉప్పల్ బాలు రిలీజ్ చేసిన లేటెస్ట్ వీడియో..

కాగా కేవలం హియా బ్రాండ్ ని ప్రమోట్ చేయడమే కాకుండా ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా ఉప్పల్ బాలు భారీగానే సంపాదిస్తున్నాడు. అలాగే తోటి యాక్టర్స్ తో కలిసి ఈవెంట్స్ కూడా వెళుతున్నాడు. ఇలా మొత్తానికి బాగానే సంపాదిస్తున్నాడు బాలు. సోషల్ మీడియాలో మస్త్ పాపులారిటీ ఉన్న ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడని చాలా మంది భావించారు. అది కూడా సెలబ్రిటీ కోటాలోనే కంటెస్టెంట్ గా ఎంపికవుతాడని ఊహించారు. అలాంటిది ఆయనను ‘అగ్నిపరీక్ష 2’ ఆడిషన్స్ కి పిలవడమే కాకుండా ఘోరంగా అవమానించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఉప్పల్ బాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us