AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: ఇన్‌స్టాగ్రామ్‌లో14 మిలియన్ల ఫాలోవర్లు.. కానీ హీరో యశ్ ఫాలో అయ్యేది ఆ ఒక్కరిని మాత్రమే

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన 'టాక్సిక్' సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీకెండ్ నుంచే టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

Toxic Movie: ఇన్‌స్టాగ్రామ్‌లో14 మిలియన్ల ఫాలోవర్లు.. కానీ హీరో యశ్ ఫాలో అయ్యేది ఆ ఒక్కరిని మాత్రమే
Toxic Movie Yash
Basha Shek
|

Updated on: Aug 20, 2026 | 7:44 PM

Share

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇప్పుడీ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు యశ్. ఈ రెండు సినిమాలతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ రాకింగ్ స్టార్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో యశ్ కు 14 మిలియన్లకు (1.4 కోట్ల) పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే యశ్ మాత్రం కేవలం ఒకే ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం టాక్సిక్ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటున్నాడు యశ్. నేషనల్ మీడియా ఛానెల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు యశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి హీరో యశ్ ను ఒక ప్రశ్న అడిగింది. “మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతారు. ఎవరా వ్యక్తి, మీ జీవితంలో వారి విలువ ఏమిటి?’ అని రాకింగ్ స్టార్ ను అడిగింది. దీనికి యశ్ నవ్వుతూ  ‘ఆమె  నా భార్య”అని  ఎంతో  ప్రేమగా ఆన్సర్ ఇచ్చాడు. ఇది విన్న స్టూడియో మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.

‘ఆమె నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఒకవేళ నేను తనని కూడా ఫాలో అవ్వకుండా జీరో పెడితే నాకు ఇబ్బందులు తప్పవు (నవ్వుతూ) .. నిజం చెప్పాలంటే, ఆమె నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మేమిద్దరం కలిసి ఎదిగాము. ఆమె నాకు భార్యగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నా జీవితానికి బలమైన ఆధారం’ అని తన భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చారు యశ్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

భార్య గురించి యశ్ మాటల్లో..

భార్యతో యశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us