AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pizza: పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్‌ పడింది.. అట్లుంటదిమరి కస్టమర్స్‌తో పెట్టుకుంటే..

Pizza: పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్‌ పడింది.. అట్లుంటదిమరి కస్టమర్స్‌తో పెట్టుకుంటే..

Phani CH
|

Updated on: Aug 23, 2026 | 6:14 PM

Share

ఉత్తరాఖండ్‌లో ఓ వినియోగదారుడు ఆన్‌లైన్‌లో 10 అంగుళాల పిజ్జా ఆర్డర్ చేయగా 7 అంగుళాల పిజ్జా డెలివరీ అయింది. రూ.505 రీఫండ్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం ఫుడ్ డెలివరీ సంస్థ, రెస్టారెంట్ కలిసి రూ.10,520 పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. తప్పుడు సైజు పిజ్జా పంపడం సేవల్లో లోపం, అన్యాయ వాణిజ్య పద్ధతి అని స్పష్టం చేసింది.

ప్రస్తుతకాలంలో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే మోసపోవడం సర్వసాధారణమైపోయింది. అలా మోసపోయిన ఓ వినియోగదారుడు లబోదిబోమంటూ ఊరికే కూర్చోలేదు. న్యాయం కోసం పోరాడి విజయం సాధించాడు. పది అంగుళాల పిజ్జాకు బదులుగా ఏడు అంగుళాల పిజ్జా డెలివరీ చేసినందుకు ఏకంగా పిజ్జా ధర కంటే 20 రెట్లు ఎక్కువ పరిహారాన్ని రాబట్టాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఓ వినియోగదారుడు ఆన్‌లైన్ ఫుడ్ యాప్ ద్వారా రూ.505 వెచ్చించి 10 అంగుళాల పిజ్జాను ఆర్డర్ చేశాడు. అయితే ఇంటికి చేరిన పిజ్జాను పరిశీలిస్తే అది కేవలం 7 అంగుళాలే ఉన్నట్లు తేలింది. మోసపోయానని గ్రహించిన ఆయన వెంటనే కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించి రీఫండ్ చేయాల్సిందిగా కోరారు. అందుకు వారు ససేమిరా అన్నారు. దీంతో ఆయన జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్, CPGRAMS పోర్టల్‌ను ఆశ్రయించడంతో పాటు లీగల్ నోటీసు కూడా పంపించారు. ఎక్కడా స్పందన రాకపోవడంతో చివరకు వినియోగదారుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కమిషన్.. తప్పుడు సైజు పిజ్జాను పంపడం సేవల్లో లోపమని, ఇది అన్యాయ వాణిజ్య పద్ధతి అని స్పష్టం చేసింది. ఫుడ్ డెలివరీ సంస్థ, రెస్టారెంట్ కలిసి బాధితుడికి రూ.10,520 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో పిజ్జా ధర, డెలివరీ ఛార్జీలతో పాటు మానసిక వేదనకు రూ.5,000, కేసు ఖర్చుల కింద మరో రూ.5,000 పరిహారంగా అందజేయాలని స్పష్టం చేసింది. 45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. తాము కేవలం రెస్టారెంట్లు, వినియోగదారుల మధ్య మధ్యవర్తులమని ఫుడ్‌ డెలివరీ సంస్థ వాదించింది. కంపెనీ చేసిన ఈ వాదనను కమిషన్ తోసిపుచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు.. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు!

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్! భారీగా తగ్గిన ఎయిర్‌పోర్ట్ ఫీజు

ఇస్రో సంచలన నిర్ణయం.. ఇకపై రాకెట్ల తయారీకి గుడ్‌ బై

Sugar Price: ఘాటెక్కిన చక్కెర.. పండగ వేళ సామాన్యులకు చుక్కలు

Follow Us