AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Price: ఘాటెక్కిన చక్కెర.. పండగ వేళ సామాన్యులకు చుక్కలు

Phani CH
|

Updated on: Aug 23, 2026 | 6:08 PM

Share

దేశవ్యాప్తంగా చక్కెర, బెల్లం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ ప్రాంతాల్లో కేవలం 15 రోజుల్లోనే కిలో చక్కెర ధర రూ.30 నుంచి రూ.70కు చేరడం కలకలం రేపుతోంది. వర్షాభావం, చెరకు సాగు తగ్గడం, దిగుబడి పడిపోవడం వల్ల సరఫరా కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

దేశవ్యాప్తంగా చక్కెర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. షుగర్ ధర పెరగడంతో పాటు బెల్లం ధరలు కూడా ఆకాశాన్ని తాకడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని కర్నూలు, విజయవాడ వంటి నగరాల్లో బెల్లం, చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే కిలో చక్కెర ధర రూ. 30 నుండి రూ. 70కి పెరగడం గమనార్హం. ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఇక విజయవాడ విషయానికి వస్తే, 15 రోజుల క్రితం కిలో రూ. 46, వారం క్రితం రూ. 52గా ఉన్న చక్కెర ధర.. ప్రస్తుతం రూ. 70కి చేరుకుంది. రేటు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ అసాధారణ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం వర్షాలు లేకపోవడం, చెరకు పంట సాగు గణనీయంగా తగ్గడమేనని వ్యాపారస్తులు చెబుతున్నారు. పంట దిగుబడి తగ్గడంతో సరఫరాలో ఏర్పడిన కొరత ధరలపై ప్రభావం చూపుతోంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ధరలను అదుపు చేయాలని వినియోగదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులకు, చక్కెర ధరల పెరుగుదల మరింత భారం అవుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్‌లో ధరల పెరుగుదలను నివారించాలని, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల

బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్‌ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

Follow Us